k vijaya rama rao, khairatabad, cbi former director, telugu desam party, ghmc elections

Vijayarama rao resigns from telangana tdp

k vijaya rama rao, khairatabad, cbi former director, telugu desam party, ghmc elections

Ahead of crucial GHMC elections, the TDP received yet another shock when former minister and former CBI director K Vijayarama Rao resigned from the party.

తెలంగాణ టీడీపీకి మరో దెబ్బ.. మాజీ మంత్రి రాజీనామా..!

Posted: 12/11/2015 06:24 PM IST
Vijayarama rao resigns from telangana tdp

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఒక వైపు పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తెలంగాణ ప్రాంత తెలుగుదేశం నేతలతో భేటీ అయ్యి.. హుషారెక్కిస్తున్న క్రమంలో తెలంగాణ టీడీపీ పార్టీకీ మరో దెబ్బ తగిలింది. సరిగ్గా ఇవాళ, రేపట్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతాయన్న తరుణంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి విజయ రామారావు రాజీనామా చేశారు. గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన మాజీ సీఎల్పీ నేత దివంగత పి.జనార్ధన్‌రెడ్డి(పీజేఆర్) పై 1999 లో పోటీ చేసి గెలిచారు. దీంతో తొలి ప్రయత్నంలోనే చంద్రబబాబు హయంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

అంతేకాక గతంలో సీబీఐ డైరెక్టర్గా విజయరామారావు పనిచేశారు. ప్రస్తుతం అధికార పార్టీ టీఆర్ఎస్లో విజయ రామారావు చేరతారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ విజయ రామారావు టీఆర్ఎస్ పార్టీ లో చేరితే ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి ఊపందుకున్నట్లే. జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి మొదలైన నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి అధికార టీఆర్ఎస్ లోకి భారీ వలసలు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijaya ramarao  PJR  CBI director  TDP  TRS  

Other Articles