greater hyderabad municipal corperation elections likely on january 17th

Greater hyderabad elections likely on january 17th

GHMC elections, Greater Hyderabad, january 17, election commission, greater hyderabad elections, TRS, congress, TDP, election work, corperation elections work,

greater hyderabad municipal corperation elections likely on january 17th as the officials has made all the work done.

జనవరి 17 గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలు..?

Posted: 12/11/2015 07:52 PM IST
Greater hyderabad elections likely on january 17th

రాజకీయ పార్టీలతో పాటు నగరవాసులు కూడా ఎప్పుడెప్పుడా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేటర్ ఎన్నికల నగరా త్వరలో నగరా మ్రోగనుంది. కొత్త ఏడాది తొలి మాసంలో బహుళ పక్షంలోనే ఈ ఎన్నికలు జరుగుతాయని విశ్వాసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల తేదీ రమారమిగా ఖరారు అయింది. వచ్చే ఏడాది జనవరి 17వ ఎన్నికలు జరగనున్నాయని తెలుస్తుంది.
 
ఈ మేరకు ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎన్నికల సంఘం అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో  పోలింగ్కు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించినట్లు సమాచారం. మరోవైపు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC elections  Greater Hyderabad  january 17  election commission  

Other Articles