US aid to Pakistan will be used against India: former diplomat

Us aid to pakistan will be used against india husain haqqani

us help to pakistan, pakistan and us, us helps pakistan, us and terrorism, obama helps pakistan, pakistan and india, indo-pak, diplomats, pakistan diplomat, indian diplomat us behind pakistan, US aid to Pakistan, Terrorists, Husain Haqqani

Director of South & Central Asia at the Hudson Institute, a top American think-tank, Haqqani said competition with India remains the overriding consideration in Pakistan's foreign and domestic policies.

పాక్ టార్గెట్ ఇండియానే- పాక్ మాజీ దౌత్యవేత సంచలన వ్యాఖ్యలు

Posted: 12/08/2015 01:30 PM IST
Us aid to pakistan will be used against india husain haqqani

పాకిస్థాన్ కు ధాయాధి భారత్ అంటే ఎంతలా పగ పెంచుకుందో తెలియంది కాదు. సరిహద్దు వెంబడి కాల్పులు విరమణకు తెగబడుతుంది ఉగ్రవాదులే అయితే వారు అక్కడి వరకు పాకిస్థాన్ ఆర్మీని దాటుకుని ఎలా వస్తున్నారన్న ప్రశ్నకు పాకిస్థాన్ ప్రభుత్వం వద్ద సమాధానమే లేదు. భారత్ పాక్ సరిహద్దులో వరుస కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నది పాకిస్థాన్ సైన్యమే అని, తమ దేశంలోని ఉగ్రవాదులను భారత్ లోకి చోచ్చుకెళ్లేందుకు వీలుగా ఒక చోట కాల్పలు జరుపుతూ మరో చోట నుంచి వారిని భారత్ లోకి పంపుతున్నారన్న భారత్ వాఖ్యల్లో నిజం దాగివుంది.

పాకిస్థాన్ నిజస్వరూపాన్ని అదేశానికి చేందిన అమెరికాలో పాక్ మాజీ అంబాసిడర్ హుస్సేన్ హుక్కానీ బయటపెట్టారు ఉగ్రవాదులను నిలువరించేందుకు పాకిస్థాన్ కు ఎటువంటి సాయం చేసినా, అది భారత్ పై పోరుకే వాడుతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందించాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఆయన తప్పుబట్టారు. ఆ విమానాలతో ఉగ్రవాదులతో పోరాడాల్సిన పాక్, దాన్ని పక్కనబెట్టి, వాటిని ఇండియాపై ప్రయోగిస్తుందని ఆయన అన్నారు.

"ఒబామా సర్కారు పాకిస్థాన్ తో ఓ అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని యోచిస్తోంది. కొద్ది నెలల క్రితం ఒక బిలియన్ డాలర్ల విలువైన యుద్ధ హెలికాప్టర్లను అందించే డీల్ కుదుర్చుకుంది. వీటితో దక్షిణాసియాలో అశాంతి పెరిగే ప్రమాదముంది" అని అన్నారు. పాకిస్థాన్ తన దృక్పథాన్ని పూర్తిగా మార్చుకోవాల్సి వుందని, ఏ ఒక్క ఉగ్రమూలాన్నీ వదలకుండా తుదముట్టించేందుకు కట్టుబడాల్సి వుందని అన్నారు. అలా జరుగకుంటే, అమెరికన్ ఆయుధాలు భారత్ వైపు దూసుకెళతాయని హెచ్చరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US aid to Pakistan  Terrorists  Husain Haqqani  

Other Articles