Jagan will ban liquior in ap

Jagan will ban liquior in ap

Jagan, Jagan Mohan Reddy, AP, Liquior, Cheap Liquior, Chandrababu Naidu, Cheap Liquior in Ap, Chandrababu Naidu on cheap liquior, Vijayawada, YS Jagan

Jagan said that he will ban the liquior in ap after he become Chief Minister. Jagan visited cheap liquior death victims families.

జగన్ సిఎం అయ్యేదెన్నడు.? మందు బందయ్యేదెన్నడు..?

Posted: 12/08/2015 03:21 PM IST
Jagan will ban liquior in ap

ఏపి ప్రతిపక్షనేత వైయస్ జగన్ మరోసారి పరామర్శ యాత్ర నిర్వహించారు. నిన్న విజయవాడ కృష్ణలంకలో కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యలను పరామర్శించిన జగన్ ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యలపు పలకరించిన జగన్ వారి కుటుంబాల గురించి ఆరా తీశారు. అయితే అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడుతూ.. ఏపిలో మందు బంద్ చేస్తానని వెల్లడించారు. అయితే దీనికి కొన్ని కండీషన్స్ అప్లై అన్నట్లుంది.

Also Read: కేసీఆర్ కు ఎదురు నిలిచే మగాడు ఎవ్వడు...?

ప్రస్తుతం ప్రతిపక్షనేత హోదాలో ఉన్న .జగన్ సిఎం పదవి చేపట్టిన తర్వాత ఏపిలో మద్యాన్ని నిషేదిస్తానని తెలిపారు. గతంలో మద్యాన్ని నిషేదిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఎక్సైజ్ మంత్రి సొంత  జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం నిర్లక్షం వల్లే కల్తీ మద్యం విక్రయాలు సాగుతున్నాయని జగన్ ఆరోపించారు. కల్తీ మద్యం వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ప్రకటించిన ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ఎంత మాత్రం సరిపోదని వారికి ఇరవై లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles