Chandrababu Naidu anounce five lakh exgratia to liquior death families

Chandrababu naidu anounce five lakh exgratia to liquior death families

Vijayawada, Krishnalanka, Cheap Liquior, Death by cheap liquior

AP CM Chandrababu Naidu announce five lakh rupees exgratia to Viajayawa cheap liquior death families. Chandrababu visits hospital and greet them.

చంద్రబాబు ఐదు లక్షలు ప్రాణాలు వస్తాయా..?

Posted: 12/08/2015 08:24 AM IST
Chandrababu naidu anounce five lakh exgratia to liquior death families

విజయవాడలో కల్తీ మద్యంఆరుగురి ప్రాణాలను బలిగొంది. అయితే మరి కొంత మందిని జీవచ్ఛవాలుగా మార్చింది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుకు ఛేదు అనుభవం ఎదురైంది. బాధితులను పరామర్శించడానికి వచ్చిన ముఖ్యమంత్రికి.. ప్రజాసంఘాల నేతల నుంచి నిరసన ఎదురైంది. బాధిత కుటుంబాలకు పది లక్షలు నష్టపరిహారం చెల్లించాలని.. అలాగే ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రను పదవి నుంచి తప్పించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి దగ్గరగా వెళ్లి నిరసన తెలపడానికి ప్రజాసంఘాలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కల్తీ మద్యం ఘటనపై సమగ్ర విచారణ చేపడతామని సీఎం తెలిపారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యలను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు కూడా బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబీకుల్ని పరామర్శించి ఓదార్చారు. ఎంత ఖర్చైనా వెనుకాడకుండా.. బాధితులను కాపాడతామని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని దేవినేని ఉమ చెప్పారు. కల్తీ మద్యం కేసులో కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కల్తీ మద్యం వల్లే తమ వారు ప్రాణాలు కోల్పోయారంటూ మృతుల బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. బార్ ఓనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎక్సైజ్ మినిస్టర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, మరో ప్రాణం పోకుండా ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. నిపుణుల బృందాలతో వైద్యం అందిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijayawada  Krishnalanka  Cheap Liquior  Death by cheap liquior  

Other Articles