worms found in Baba Ramdevs Patanjali atta noodles

Worms found in baba ramdevs patanjali atta noodles

Ramdev, Patanjali, Noodles, worms in Ramdev noodles, Noodles from Patanjali

Even as it is yet to clear the air around the controversy involving selling its noodle brand without appropriate license from the Indian food regulator, yoga guru Baba Ramdev-promoted Patanjali brand has faced heat from a consumer for an alleged worm that landed in his plate of Patanjali Atta Noodles. Patanjali has rubbished the reports saying they are "fabricated".

పతంజలి స్పెషల్ నూడుల్స్: పురుగులతో

Posted: 12/08/2015 08:22 AM IST
Worms found in baba ramdevs patanjali atta noodles

యోగా గురువు బాబా రాందేవ్‌ నవంబరు 17న మార్కెట్‌లోకి విడుదల చేసిన అట్టా నూడుల్స్‌ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాయి. హర్యానాలో వినోద్‌కుమార్‌ ఈ నూడుల్స్‌ను కొనగా, అతడికి విపత్కర పరిస్థితి ఎదురైంది. నూడుల్స్‌ ప్యాకెట్‌లో పురుగులు దర్శనమిచ్చాయి. నవంబరులో ఇవి మార్కెట్‌లోకి ప్రవేశించిన వెంటనే ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆమోదం తీసుకోకుండానే ఈ నూడుల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాము బాబా నూడుల్స్‌కు ఎలాంటి అనుమతులూ జారీ చేయలేదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది కూడా.

హర్యానాలోని జింద్‌ ప్రాంతం నర్వానాలో స్వదేశీ స్టోర్‌లో వినోద్‌కుమార్‌ అట్టా నూడుల్స్‌ ప్యాకెట్‌ను కొనుగోలు చేశారు. 'దుకాణం నుంచి నెయ్యితోపాటు, నూడుల్స్‌ ప్యాకెట్‌ కూడా ఆదివారంనాడు కొన్నాను. వీటిని ఆరోగ్యకరమైనవిగా నేను భావించాను. అయితే తర్వాత రోజు వాటిని వండుతుండగా చనిపోయి వున్న పురుగులు దర్శనమిచ్చా యి. ప్యాకెట్‌లో సగం నూడుల్స్‌ మిగిలి ఉండటంతో అందులో చూశాను. వాటిలో కూడా పురుగులున్నాయి. వెంటనే నేను ఫిర్యాదు నమోదు చేసేందుకు పతంజలి దుకాణానికి వెళ్ళాను' అని వినోద్‌కుమార్‌ చెప్పారు. ఈ విషయమై దుకాణదారుడిని ప్రశ్నించగా... ఆ ప్యాకెట్‌ తానే అమ్మానని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం వినోద్‌కుమార్‌ పతాంజలీ అట్టా నూడుల్స్‌పై కోర్టులో దావా వేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. 'ప్రపం చంలో మొట్టమొదటిిసారి గా పురుగుల నూడుల్స్‌ను పతంజలి ప్రవేశపెట్టింది' అని ఒకరు ట్వీట్‌ చేశారు. 'ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి లేకుండా పురుగుల నూడుల్స్‌ అమ్ముతున్న అతని చట్టవ్యతిరేక పనికి హ్యాట్సాఫ్‌' అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramdev  Patanjali  Noodles  worms in Ramdev noodles  Noodles from Patanjali  

Other Articles