Sonia Gandhi and Rahul Gandhi to Court

Sonia gandhi and rahul gandhi to court

Sonia Gandhi, Rahul Gandhi, Court, Congress, National Herald, Mothillal voora, Suman dube, Sham petrado

Observing that the conduct of Congress office-bearers named in the National Herald case “smacks of criminality”, the Delhi High Court dismissed Monday appeals filed by Congress president Sonia Gandhi, vice president Rahul Gandhi and five others against summons to face trial.

నేడు కొర్టుకు సోనియా, రాహుల్

Posted: 12/08/2015 09:12 AM IST
Sonia gandhi and rahul gandhi to court

చట్టం ముందు అందరూ సమాన అని బారత రాజ్యాంగంలో ఉంది. చట్టం ఎవరికి చుట్టం కాదు.. ఎవరినైనా ఒకేలా చూస్తుంది అని న్యాయశాస్త్రంలో ఉంది. అయితే భారత న్యాయవ్యవస్థకు ఉన్న అసపరిమిత శక్తులు భారత పౌరులకు పూర్తి స్వతంత్రాన్ని, హక్కులను కల్పిస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామని అనుకుంటున్నారా..? తాజా ఓ కేసులో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ కోర్టు ముందు నేడు హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలు కోర్టు ముందు హాజరుకావాలరి కింది కోర్టుట్టిన ఉత్తర్వుల మీద వారు హైకోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ కూడా కింద కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ.. సోనియా, రాహుల్ హాజరుకావాల్సిందేనని కోర్ట్ స్పష్టం చేసింది.

సోనియా, రాహుల్ తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న పార్టీ సీనియర్ నేతలు మోతిలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండేజ్, సుమన్ దూబే, శ్యాం పిట్రోడా తదితరులు కూడా నేడు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులోనైనా వారికి ఊరట లభిస్తుందా? లేదా? అన్న విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో కోర్ట్ ముందు సోనియా, రాహుల్ అన్న వార్త మీద సెటైరికల్ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonia Gandhi  Rahul Gandhi  Court  Congress  National Herald  Mothillal voora  Suman dube  Sham petrado  

Other Articles