Father and son collided with a car and father died

Father and son collided with a car and father died

Karnataka, Accident, Son accident father

In Karnataka, A son brought a new car and he is learing driving. He is not perfect in driving so he collied his own father.

కారుతో తండ్రిని ఢీకొట్టిన కొడుకు.. తండ్రి మృతి !

Posted: 12/05/2015 05:15 PM IST
Father and son collided with a car and father died

కొడుకు ప్రయోజకుడు అయితే సంతోషించేది ముందు తండ్రే. అయితే దురదృష్టం  వెంటాడితే అరటిపండు తిన్నా.. పళ్లూడినట్లు తానొకటి తలిస్తే తలిచిందన్నట్లు ఓ కొడుకు పరిస్థితి ఉంది. కొత్తగా కొన్న టాటా సుమో కోసం డ్రైవింగ్ రాని కొడుకు శిక్షణ తీసుకుంటున్నాడు. కారు వెనుక ఉన్న తండ్రిని గమనించకుండా డ్రైవ్ చేయడంతో తండ్రి స్పాట్ చనిపోయిన ఘటన కర్నాటకలోని డెంకణీ కోటలో జరిగింది.  హనుమంతపురానికి చెందిన సుగ్గప్పకు గోవిందన్ అనే కొడుకున్నాడు. గోవిందన్ కొత్తగా టాటా సుమో కొనుగోలు చేశాడు.

అయితే కొత్త కారు కొన్నాడు కాబట్టి ఎలాగైనా డ్రైవింగ్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. అందుకు గాను డ్రైవింగ్ స్కూల్ లో వారంరోజులుగా శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే కారును రివర్స్ చేసే ప్రయత్నంలో సుమో వెనుకే ఉన్న తండ్రిని గోవిందన్ గమనించకుండా డ్రైవ్ చేయడంతో తీవ్ర గాయాలైన సుగ్గప్ప ఘటనాస్థలంలోనే  చనిపోయాడు. కొడుకు కారు ఢీకొని తండ్రి చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka  Accident  Son accident father  

Other Articles