Pilot faces disciplinary action after letting former wife of Imran Khan

Pilot faces disciplinary action after letting former wife of imran khan

imran han, Pakistan, london, Pilot, VIP in cockpit, Ms Reham, Ms Reham in London flight

A pilot is facing disciplinary action after allowing Imran Khan's ex-wife to sit in the cockpit for 'a few minutes' during a flight from London to Lahore. Reham Khan, a former BBC weathergirl, was granted access by the Pakistan International Airlines (PIA) staff member despite it being illegal.

విఐపి భార్య కోరిక తీరిస్తే ఉద్యోగం ఊడింది

Posted: 12/05/2015 05:32 PM IST
Pilot faces disciplinary action after letting former wife of imran khan

ఆమె కొరిక తీర్చినందుకు పాపం పైలెట్ ఉద్యోగం ఊడింది. పాకిస్థాన్ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇమ్రాన్ ఖాన్ తో పరోక్షంగా ముడిపడి ఉంది. ఇంతకీ ఏంటా ముడి అనుకుంటున్నారా..? ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య ఈ మొత్తం తతంగానికి కారణం. విఐపిల సరదాలు ఒక్కోసారి ఉద్యోగులకు సంకటంగా మారతుంటాయి. పాకిస్తాన్‌లో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఇమ్రాన్‌ఖాన్‌కు ఇటీవల విడాకులు ఇచ్చిన ఆయన మాజీ భార్య రెహమ్‌ ఖాన్‌ ముచ్చట ఓ పైలెట్‌ ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. లండన్‌ నుంచి లాహోర్‌ ప్రయాణించిన రెహమ్‌ ఖాన్‌కు విమానంలోని కాక్‌పిట్‌లో కూర్చోవాలన్న కోరిక పుట్టిందట. అంతే పైలెట్‌ను అడిగింది.

విఐపి,  పైగా వార్తల్లో ఉన్న వ్యక్తి ముచ్చట తీర్చుదామని పైలెట్‌ ముందు వెనకా ఆలోచించకుండా ఆమెను కాక్‌పిట్‌లోకి అనుమతించాడు. కొద్ది నిమిషాల పాటు ఆమె కాక్‌పిట్‌లో కూర్చుని ముచ్చట తీర్చుకుంది. అంతటితో ఆగలేదు. ఈ ఫోటోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసింది. నిబంధనల ప్రకారం పైలెట్లు తప్ప ఇతరులను కాక్‌పిట్లోకి ఎవరినీ అనుమతించకూడదు. ఫోటోలు సోషల్‌ మీడియాలో రావడంతో అనుమతించిన పైలెట్‌పై ప్రభుత్వం ఆగ్రహించింది. ప్రభుత్వం రంగ సంస్థ కావడంతో విచారణకు ఆదేశించింది. సదరు పైలెట్‌ ఉద్యోగం ప్రమాదంలో పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : imran han  Pakistan  london  Pilot  VIP in cockpit  Ms Reham  Ms Reham in London flight  

Other Articles