Russia With France Against ISIS

Russia with france against isis

ISIS, Russia, Syria, France, attack on ISIS, ISIS terrorists, Russian navy, France attack on ISIS

Russia said for the first time that a bomb aboard a Russian charter jet full of vacationers had destroyed the aircraft that crashed more than two weeks ago on Egypt’s Sinai Peninsula, and the Kremlin responded immediately by escalating airstrikes across Syria.

ఐసిస్ మీద ఫ్రాన్స్ తోపాటు రష్యా దాడి

Posted: 11/18/2015 08:06 AM IST
Russia with france against isis

సిరియాలోని ఐఎస్ స్థావరాలపై ఫ్రాన్స్, రష్యా విరుచుకుపడుతున్నాయి.  అత్యాధునిక యుద్ధ విమానాలతో దాడులు చేశాయి. పారిస్‌లో ఉగ్రవాదుల మారణకాండకు 129 మంది బలయ్యారు. దీనికి ప్రతీకారంగా ఉత్తర సిరియాలోని ఐఎస్ శిక్షణ స్థావరాలపై దాడులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆదేశించారు. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లపై పోరాటంలో తమకు సహకరించాలని అమెరికా, రష్యాతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ను కోరారు. 26 ఈయూ దేశాలు తమ సమ్మతి తెలిపాయి. దాడులకు సహకరించాలని బ్రిటన్ భావిస్తోంది. మరోవైపు ఫ్రాన్స్ అభ్యర్థనకు రష్యా వెంటనే స్పందించింది. సిరియాలోని ఐఎస్ కీలక స్థావరాలపై యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. ఇటీవల ఈజిప్టులోని సినాయ్ ద్వీప కల్పంలో తమ విమానం కూలడానికి ఉగ్రవాదులు పెట్టిన బాంబే కారణమని రష్యా నిర్థారించింది. ఐఎస్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షడు పుతిన్ ప్రకటించారు. 224 మంది ప్రయాణికుల మృతికి కారణమైన వారి సమాచారం అందించిన వారికి 50 మిలియన్ డాలర్ల బహుమానం ఇస్తామని రష్యా ప్రకటించింది.

పారిస్‌పై ఉగ్రదాడికి తగిన విధంగా బుద్ధిచెప్పాలని పంతంతో ఉన్న ఫ్రాన్స్‌.. సిరియాలోని ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) స్థావరాలపై ముప్పేట విరుచుకుపడుతోంది. దాడులను మరింత ఉధృతం చేసే క్రమంలో ఛార్లెస్‌ డె గాలె యుద్ధ నౌక ద్వారా ఎయిర్‌క్రాఫ్ట్‌లను రంగంలోకి దింపినట్టు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హొలాండ్‌ వెల్లడించారు. యూఏఈ, జోర్డాన్‌ల మీదుగా ఇప్పటికే ప్రయోగించిన 12 యుద్ధ విమానాలు ఐఎస్‌ స్థావరాలపై భీకరంగా దాడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, మొత్తం 38 ఫైటర్‌ జెట్లను ప్రయోగించే అవకాశముందని, ఫలితంగా సిరియాలోని ఐఎస్‌ లక్ష్యాలపై గురితప్పని రీతిలో విజయం సాధించవచ్చని అధ్యక్షుడు తెలిపారు. రానున్న కొన్ని వారాల పాటు తమ దాడులు కొనసాగుతాయని ఆయన చెప్పారు. కాగా ఉత్తర సిరియాలో ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న రాజధాని రక్కాపై అమెరికా సాయంతో తాజాగా జరిపిన దాడుల్లో కమాండ్‌ కేంద్రం, శిక్షణ కేంద్రాలు సహా ఐఎస్‌కు చెందిన పలు స్థావరాలను ధ్వంసం చేసినట్టు ఫ్రాన్స్‌ రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  Russia  Syria  France  attack on ISIS  ISIS terrorists  Russian navy  France attack on ISIS  

Other Articles