Chandrababu Naidu not present till now

Chandrababu naidu not present till now

Chandrababu Naidu, Babu, warangal, Elections, Warangal Elections, BJP, NDA Candidate in warabngal elections, warangal Polls, TDP in warangal

AP CM Nara Chandrababu naidu didnt present till now in warangal election campaign. All parties campaigning in Warangal elections.

చంద్రబాబు ఇంకా ప్రజెంట్ కాలేదు

Posted: 11/17/2015 10:30 AM IST
Chandrababu naidu not present till now

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు తప్ప మిగిలిన అందరు రాజకీయ ప్రముఖులు వరంగల్ గుమ్మం తొక్కుతున్నారు. టిఆర్ఎస్, టిడిపి-బిజెపి అభ్యర్థికి మధ్యన సాగుతున్న రసవత్తర పోరుకు అన్ని పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీకి చెందిన నాయకుడికే ఓటు వెయ్యాలని జగన్ ప్రచారం చేశారు. తెలంగాణ, ఏపి ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయిన తర్వత మొదటి ఉప ఎన్నికల్లో జగన్ ప్రచారాన్ని నిర్వహించారు. తెలంగాణలో పార్టీకి ఉన్న బలాన్ని మరింత పెంచేందుకు జగన్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు గాను ఎన్నికల్లో భారీగా ప్రచారానికి ముందుకు వచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ల దగ్గరి నుండి ఛోటా లీడర్ల వరకు అందరూ కూడా ప్రచారంలో పాలుపంచుకున్నారు.

Also Read: చంద్రబాబుకు తిరుపతి సెంట్ మెంట్

టిడిపి బిజెపి ఉమ్మడి అభ్యర్థి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేంద్ర మంత్రులు కూడా ప్రచారంలో పాల్గొనడం గమనార్హం. ఇక టిఆర్ఎస్ పార్టీ నుండైతే అందరు మంత్రులు, నాయకులు ప్రచార బాధ్యతలను మోసకున్నారు. హరీష్ రావు, కేటీఆర్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు ఈ ఎన్నికలను. నిన్న జగన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా.. నేడు కేసీఆర్ ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తారు. అయితే మరి ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు. కాగా ఇక ముందు కూడా నిర్వహిస్తారా లేదా అన్నది అనుమానమే. ఎందుకంటే ఇప్పటి దాకా వరంగల్ పర్యటన ఖరారు కానేలేదు మరి. చూడాలి కనీసం ఇక ముందైనా చంద్రబాబు వరంగల్ లో ప్రచారం చేస్తారో లేదో..?

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles