A young man named shiva kumar filed case against his girlfriend | karnataka love affairs | boyfriend filed case against girlfriend

Young man filed case against his girlfriend because she left

boyfriend case against girfriend, boyfriend filed case on girlfriend, shivakumar lose virginity, boy virginity case in karnataka, karnataka crime stories, boyfriend affairs, girlfriend affairs, love affairs controversies

young man filed case against his girlfriend because she left : A young man named shiva kumar filed case against his girlfriend because of her he left his virginity.

‘నా శీలాన్ని దోచేసి వదిలేసింది.. న్యాయం చేయండి’

Posted: 11/17/2015 11:04 AM IST
Young man filed case against his girlfriend because she left

సాధారణంగా అమ్మాయిలు తాము ప్రేమించిన వ్యక్తి చేతిలో మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయిస్తుంటారు. కానీ.. ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగింది. తనకు ఇష్టం లేకపోయినా ఓ అమ్మాయి తనను బలవంతంగా లొంగదీసుకుని తన శీలాన్ని దోచేసిందని.. తతను వాడుకున్న తర్వాత వదిలేసి వెళ్ళిపోయిందని.. శీలం కోల్పోయిన తాను మరొకరిని ఎలా వివాహం చేసుకోవాలని ప్రశ్నిస్తూ.. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయండంటూ పోలీసులను ఆశ్రయించాడు ఓ బాధితుడు.

కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు తుమకూరు జిల్లా బెళ్లావి తాలూకాకు చెందిన శివకుమార్ కు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. రెండేళ్లవరకు వీరి ప్రేమాయణం సజావుగానే సాగింది కానీ ఇంతలోనే ఏమైందో తెలీదు.. సదరు యువతి అతడికి దూరంగా వుంటోంది. తన ప్రియురాలు తనకు దూరంగా వుండడాన్ని జీర్ణించుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైన శివకుమార్.. రెండు రోజుల ముందు స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. ‘మొదట్లో నేను వద్దంటూ ఎంతగా వారించినా ఆ యువతి నాపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రేమించేలా చేసింది. కొన్నాళ్ల తర్వాత శారీరక సంబంధం ప్రస్తావన తీసుకొచ్చింది. నేను తప్పని చెబుతున్నా బలవంతంగా నాతో శారీరక సంబంధం కొనసాగించింది. అంతేకాకుండా గర్భవతి కూడా అయింది. ఆ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు నన్ను బెదిరించి రూ. 30 వేలు తీసుకుని ఆమెకు గర్భప్రావం చేయించారు. ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి నాతో సంబంధం కొనసాగించింది. అప్పుడు ఆమె బాగోగుల కోసం రూ.5 లక్షల మేర ఖర్చు చేశాను. అంత సవ్యంగానే సాగుతోందని అనుకుంటున్న సమయంలో ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఆమె కొంతకాలంగా నా నుంచి దూరంగా వుంటోంది. ఆమె తల్లిందండ్రులు యువతిని హాసన్లో ఉంచారని తెలుసుకుని అక్కడకు వెళ్లి గాలించినా.. ప్రయోజనం లేకుండా పోయింది’ అంటూ శివ తన ఆవేదనను పోలీసుల ముందు వ్యక్తం చేశాడు. డబ్బు పోయినందుకు తనకు బాధగా లేదని, తన శీలం పోయినందున మరొకరిని ఎలా పెళ్లి చేసుకోవాలంటూ భోరుమంటున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయం జరగాలంటే ఆ యువతిపై రేప్ కేసు పెట్టండంటూ శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మొదట ఇతని ఫిర్యాదు విని ఒక్కసారిగా షాక్ కు గురైన పోలీసులు.. ఆ తర్వాత తేరుకుని ఈ తరహా కేసులు నమోదు చేయలేమంటూ చేతులెత్తేశారు. పోలీసుల స్టేట్ మెంట్ ఖంగుతిన్న శివకుమార్.. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చివరగా మీడియాను ఆశ్రయించాడు. ప్రేమ పేరుతో మోసపోయిన ఘటనలో మహిళలు తాము అత్యాచారానికి గురైనట్లు ఫిర్యాదు చేసే కేసు నమోదు చేసుకునే పోలీసులు... పురుషుల పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారంటూ ప్రశ్నిస్తున్నాడు. తన శీలాన్ని ఆ యువతి దోచుకుందని, ఆమెపై అత్యాచారం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని లేదా ఆమెతో తనకు వివాహం జరిపించి న్యాయం చేయండి ప్రభువోనంటూ శివకుమార్ విజ్ఞప్తి చేస్తున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : boyfriend case against girlfriend  love affair controversies  

Other Articles