AP CM Chandrababu Naidu started TDP Party meeting in Tirupati

Ap cm chandrababu naidu started tdp party meeting in tirupati

chandrababu Naidu, AP, Amaravati, Tirupati, Chandrababu in Tirupati, TDP

Chandrababu Naidu said that AP will come no one position in India soon. He also said that they are constructing a world class capital city.

చంద్రబాబుకు తిరుపతి సెంట్ మెంట్

Posted: 11/13/2015 01:54 PM IST
Ap cm chandrababu naidu started tdp party meeting in tirupati

సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించే కర్తవ్యం పార్టీ కార్యకర్తలదేనని టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుపతిలో టీడీపీ పార్టీ సదస్సును అధినేత చంద్రబాబు ప్రారంభించారు. విజయవాడకు వెళ్లినప్పుడు ఆఫీసు కూడా లేదని.. ఇప్పుడు అన్నీ సమకూర్చకుంటున్నామని.. అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని చంద్రబాబు చెప్పారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మించబోతున్నామని, విభజన హామీల సాధనకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలు ప్రజాప్రతినిధులను గమనిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అధికారుల్లో జవాబుదారీతనం తీసుకువ చ్చి 2029 నాటికి దేశంలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతానన్నారు.

Also Read: ఆ బుడ్డోడి వల్ల నారా లోకేష్ హ్యాపీ

తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ పార్టీ అండగా నిలుస్తుందని.. కష్టపడి సపని చేసిన వారికి గుర్తింపు వస్తుందని కూడా చంద్రబాబు వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కరవు నివారణకు నీరు చెట్టు కార్యక్రమాన్ని రూపొందించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. జూన నాటికి హంద్రీనీవా ద్వారా చిత్తూరుకు నీరు అందిస్తామన్నారు. రెండేళ్లలో గాలేరు- నగరి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. రాయలసీమకు సాగు నీరందిస్తే గోదావరి జిల్లాలకు పోటీగా పంటలు పండిస్తారని చంద్రబాబు టీడీపీ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో సందర్భాల్లో కీలక సభలు, సమావేశాలకు తిరుపతినే వేదికవుతోంది. పదేళ్ల విరామం తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు కూడా బాబు...ఆ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే...టెంపుల్ సిటీ తిరుపతిలో మేథోమదనం నిర్వహిస్తోంది టీడీపీ.

Also Read: మోదీకి తర్వాత షాకిచ్చేది చంద్రబాబేనా...?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu Naidu  AP  Amaravati  Tirupati  Chandrababu in Tirupati  TDP  

Other Articles