Cops run after film hero, desert CM security

Cm kcr security police negligence at work went to hero prabhas house

cm Kcr, security police, negligence prabhas, Bahubali, cm kcr security police negligence, cm security went to hero's house, cm security at prabhas house,

telangana chief minister kcr was on the way to madhapur to attend a event, the police who was for his security on the road negligent at duties and went to see hero prabhas

సీఎం సెక్యూరిటీ పనులను పాతర పెట్టి.. హీరో ఇంటికి వెళ్లిన పోలీసులు

Posted: 10/31/2015 08:02 PM IST
Cm kcr security police negligence at work went to hero prabhas house

అభిమానం హద్దులు మీరితే.. అనర్థాలకు కారణమవుతుంది. అదే అభిమానం విధులను నిర్లక్ష్యం చేస్తే.. ఉన్నది పోతుంది.. ఉంచుకున్నది పోతుందని పెద్దలు అంటుంటారు. సరిగ్గా ఇప్పుడు తెలంగాణలోని కోందరు పోలీసులు ఈ వ్యాఖ్యల వెనుక పరమార్థాన్ని తెలుసుకున్నారు. అదీ ఎంతలా అంటే.. ఉద్యోగం వుంటేనే సమాజంలో విలువ అనేంతగ. అదెలా అంటారా..? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రతను గాలికి వదిలేసి.. అమ అభిమాన హీరో ప్రభాస్ ఇంటికి వెళ్లిన పోలీసులకు బాగా తెలిసివచ్చింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ క్రితం రోజు రాత్రి హైదరాబాదులోని మాదాపూర్ వైపు వెళుతున్నట్టు జూబ్లీహిల్స్ పోలీసులకు ఎప్పటిలానే ముందస్తు సమాచారం అందింది. అంటే ఆ ప్రాంతంలో ముందుగా పోలీసులు బందోబస్తు నిర్వహించాలి. కానీ, ఆ సమయంలో అదే మార్గంలో ఉన్న సినీ నటుడు ప్రభాస్ ను చూసేందుకు ఆయన నివాసానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని పోలీసులకు తెలిసింది. దాంతో ప్రభాస్ ను చూసేందుకు, కొంతమంది పోలీసులు తమ డ్యూటీని వదిలేసి ఉత్సాహంగా వెళ్లిపోయారు. ఈ విషయం ఆలస్యంగా ఉన్నతాధికారులకు తెలియడంతో సదరు పోలీసులను పిలిచి గట్టిగా క్లాస్ తీసుకున్నారట. జరిగిన ఘటనపై పూర్తిస్థాయి నివేదిక కూడా ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిసింది.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cm Kcr  security police  negligence prabhas  Bahubali  

Other Articles