Under his spell: hypnotised bank manager hands over Rs 93,000 to conman

Bank manager allegedly hypnotised into parting with rs 93 000

hypnosis, Bhupendra Kumar Maniram, State Bank of Patiala's Dadar branch manager, bewitched, Hypnotism, Cheating, Bank Manager, Loot, Conman, Bizarre case of fraud,State Bank of Patiala,bank manager hypnotised,MHADA officer,MK Sharma,State Bank of Patiala robbery,Dadar bank robbery,CCTV footage

In a bizarre case of fraud, the police are on a manhunt for a conman with powers of hypnosis after Bhupendra Kumar Maniram, a bank manager at State Bank of Patiala's Dadar branch claimed he was bewitched into parting with Rs. 93,000.

ఛూ మంతర్ కాళీ.. దెబ్బకు జేబులు కాలీ.. నయా మోసం..

Posted: 10/31/2015 07:33 PM IST
Bank manager allegedly hypnotised into parting with rs 93 000

ఇందుగలడు, అందుగలడన్న సందేహము వలదు.. ఎందెందు వెతికినా కలడు మోసగాడు.. అంటూ నారాయణనుడి స్థానంలో మోసగాళ్లను చేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కింద దగా, పైన దగా, కుడి ఎడుమల దగా, దగా అంటూ శ్రీరంగం శ్రీనివాసరావు చెప్పిన కఠోర వాస్తవాలు ఇప్పుడు మరోమారు నిజమయ్యాయి. ఏ రూపంలో, ఎటు నుంచి ఎలా వస్తారో తెలియదు కానీ మోసగాళ్లు, టంచనుగా ప్రత్యక్షమై.. కొమ్ములు తిరిగిన బ్యాంక్ మేనేజర్లను కూడా తమ ఉచ్చులోకి లాగేస్తున్నారు. తాజాగా ముంబాయిలో ఓ వ్యక్తి ఛూ మంతర్ కాళీ.. అంటూ బ్యాంక్ మేనేజర్ ను హిప్పాటైజ్ చేసి ఏకంగా బ్యాంకు మేనేజర్ నే దోచుకున్నాడు

ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా దాదర్ బ్రాంచికి ఓ వ్యక్తి వచ్చాడు. నేరుగా మేనేజర్ భూపేంద్ర కుమార్ మణిరామ్ (52) వద్దకు వెళ్లి, తనను శర్మగా పరిచయం చేసుకున్నాడు. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ డెవలెప్ మెంట్ అథారిటీ (ఎంహెచ్ఏడీఏ)లో ఆఫీసర్ గా పనిచేస్తున్నానని చెప్పుకున్నాడు. వికలాంగుడైన తన సోదరుడికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చానని మేనేజర్ తో శర్మ చెప్పాడు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అనుసరించాల్సిన విధానాన్ని అడుగుతూనే... ఎంహెచ్ఏడీఏలో ఫ్లాట్లను తక్కువ ధరకు ఇప్పిస్తానని భూపేంద్ర కుమార్ కు శర్మ ఆఫర్ చేశాడు. కొంత డబ్బును తక్షణమే సర్దుబాటు చేయాలని కోరాడు. అంతేకాదు, మాటలతో బ్యాంక్ మేనేజర్ అడ్రస్ డీటెయిల్స్, పాన్ కార్డ్ సమాచారం తదితర వివరాలను సేకరించి... ఫోన్ లో ఇతర వ్యక్తికి చేరవేశాడు.

వాస్తవానికి తానేం చేస్తున్నాడో బ్యాంక్ మేనేజర్ కు తెలియడం లేదు. ఏదో ట్రాన్స్ లో అంతా చేస్తున్నట్టు ఉంది. సీన్ కట్ చేస్తే, క్యాషియర్ వద్దకు వెళ్లిన మేనేజర్ అతని వద్ద నుంచి రూ. 90 వేలను తీసుకుని, తనవద్ద ఉన్న మరో రూ. 3 వేలను కలిపి మొత్తం రూ. 93 వేలను శర్మ చేతిలో పెట్టేశారు. ఇది జరిగిన 10 నిమిషాల తర్వాత మేనేజర్ భూపేంద్ర కుమార్ వాస్తవ లోకంలోకి వచ్చారు. తాను మోసపోయానని తెలుసుకున్నారు. అప్పటికే శర్మ అనే వ్యక్తి రూ. 93 వేలతో ఉడాయించాడు. దీంతో, భూపేంద్ర దాదర్ పోలీసులను ఆశ్రయించారు. బ్యాంకు నుంచి సీసీటీవీ ఫుటేజీని తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు మొదలు పెట్టారు. డబ్బు ఎత్తుకెళ్లిన శర్మ అనే వ్యక్తి ఎంహెచ్ఏడీఏలో పనిచేయడం లేదని తేలింది. అయితే, హిప్నాటిజం ద్వారా డబ్బులు దోచుకోవడం తొలిసారి జరిగిన ఘటనగా చెబుతన్న ముంబై పోలీసులు కొత్త పంథా మోసంపై ఆశ్చర్యపోతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hypnotism  Cheating  Bank Manager  Loot  Conman  

Other Articles