7-year-old boy takes sole care of his paralyzed father after his mother walks out

7 year old takes sole care of paralyzed father

7-year-old boy, Yanglin, paralyzed father, sole care, mother, Guizhou province, Wangpu village, 37-year-old laborer, father and son, guizhou, paralyzed, tragedy, vertebral fractures,spinal cord injury, medical treatments

The heartbreaking story of a seven-year-old boy from Guizhou province who has taken care of his paralyzed father for the past year after watching his mother walk out on them has recently made waves online.

విధి అడిన వింత నాటకం.. ఏడేళ్లకే తండ్రి అవతారం..

Posted: 10/31/2015 08:32 PM IST
7 year old takes sole care of paralyzed father

విధి అడిన వింత నాటకం ఆ ఏడేళ్ల కుర్రాడి జీవితాన్ని మలుపు తిప్పింది. అందరి పిల్లల మాదిరిగా తన ఆలన, పాలన చూడాల్సిన తల్లి ఇళ్లు వదిలి వెళ్లిపోగా, తన తండ్రి వున్నా.. లేనట్టే. మంచంపై జీవశ్చవంలా అచేతనావస్థలో వున్న తన తండ్రికే తాను తండ్రిలా మారి ఆతని మంచిచెడులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనాలోని గిజువా ప్రావిన్స్ లో నివసిస్తున్న యాంగ్ ఓ యాంగ్లిన్ కథే ఇది. విధి అతన్ని ఎలా వంచించింది. వెన్నుముకకు దెబ్బతగిలి అచేతనంగా మారిపోయిన తండ్రిని అహర్నిశలూ కంటికి రెప్పలా  కాపాడుకుంటున్న యాంగ్లిన్ .అసలెందుకు తండ్రిలా అవతారం ఎత్తాల్సి వచ్చింది. అందిరి పిల్లలా కాకుండా కుటుంబ బాధ్యతలను, తండ్రి మంచిచెడులను చూడాల్సి వచ్చిందో తెలుసా..? మనసుస్న మనుషులను కదిలించే ఈ కథ వెనుక కారణాలు ఇవే.

2013లో యాంగ్లిన్ తండ్రి  తమ ఇంటి రెండవ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కిందిపడిపోయాడు. దీంతో అతని వెన్నుముక  దెబ్బతిని పక్షవాతానికి గురై  మంచానికే పరిమితమయ్యాడు. ఉన్న డబ్బంతాఅతని వైద్యానికి ఖర్చయిపోయింది. అతని భార్య మూడేళ్ల పాపను తీసుకొని ఎటో  వెళ్లిపోయింది.  దీంతో  ఏడేళ్ల బాలుడు యాంగ్లీ , అచేతనంగా మారిన అతని తండ్రి మాత్రమే మిగలడంతో  బాధ్యతలను నెత్తికెత్తుకోక తప్పలేదు యాంగ్లీకి.  ఉదయం ఆరుగంటలకు లేచి వంట చేసి, స్కూలుకు వెళ్లడానికి ముందే తండ్రి టిఫిన్ తినిపించి, మందులు వేస్తాడు. మధ్యాహ్నం స్కూలు నుంచి ఇంటికి వచ్చి  తండ్రికి భోజనం తినిపిస్తాడు.  కుటుంబాన్ని పోషించుకునే పనిలో భాగంగా చెత్త ఏరడానికి వెళతాడు.

 దీని ద్వారా వచ్చే కొద్ది మొత్తంతో తండ్రి వైద్య ఖర్చులతో ఖర్చు కాగా, అలాగే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంత చిన్న వయసులో అతనికి ఆటాపాటాకు లేదు.   పొద్దున్న లేచిన దగ్గర నుంచీ,  వంట, నాన్న పోషణ, స్కూలు, పని. ఆ తర్వాత  అచేతనంగా మారిపోయిన అతని వెన్నుముకకు ఆయిల్ రాసి  మర్దనా చేయడం  కూడా అతని దినచర్యలో భాగం.  గత సంవత్సన్నర కాలంగా  ఈ పనుల్లో ఎక్కడా లోపం రాకుండా అటు చదువును, ఇటు కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అటు భరించలేని  నొప్పితో నిత్యం  నరకం అనుభవిస్తున్న తండ్రి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే ముక్కుపచ్చలారని ఏడేళ్ల పసిప్రాయంలో కొడుకు తనకోసం పడుతున్న తపన చూసి ఆ  ఆలోచనను విరమించుకున్నాడు. ఎంతటి  బాధనైనా తన తండ్రిలాంటి కొడుకు కోసం పంటి బిగువున ఓర్చుకుంటున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 7-year-old boy  paralyzed father  sole care  mother  

Other Articles