Mobile phones responsible for rape of minors

Mobile phones responsible for rape of minors

Azam Khan, Rape, Azam Khan news, Uttarpradesh, UP, Rapes in UP

Samajwadi Party leader Azam Khan today held mobile phones responsible for rape of minors saying misuse of these gadgets by the younger generation has led to an alarming rise in such cases.

సెల్ ఫోన్ల వల్లే రేప్ లు జరుగుతున్నాయట

Posted: 10/24/2015 04:19 PM IST
Mobile phones responsible for rape of minors

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజంఖాన్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. మొబైల్ ఫోన్ల వల్లే ఢిల్లీలో రెండేళ్ల చిన్నారిపై ఇద్దరు టీనేజ్ బాలురు అత్యాచారం జరిపిన ఘటన చోటుచేసుకున్నదని ఆయన వ్యాఖ్యానించారు. 'రెండేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన వెనుక వాస్తవాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ వాస్తవమే మొబైల్ ఫోన్. అందులో ఎలాంటి ఖర్చు లేకుండా చూడగలిగే విషయాలుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో 14, 15 ఏళ్ల బాలల చేతిలో కూడా మొబైల్ ఫోన్ ఉంటున్నది. ఈ ఫోన్లలో రెండేళ్ల చిన్నారులకు సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోలు సైతం ఉంటున్నాయి' అని ఆయన ఓ మీడియా సంస్థతో పేర్కొన్నారని వెల్లడించారు.

మొబైల్ ఫోన్లలోని వీటిని మనం ఎలా ఎదుర్కొంటున్నాం? ఎలా శిక్షిస్తున్నాం? ఈ వీడియోలు యావత్ యువతరాన్ని నాశనం చేస్తున్నాయి. వాళ్లు వయస్సులోకి రాక ముందే ప్రభావాన్ని చూపుతున్నాయి' అని ఆజం ఖాన్ అన్నారు. అయితే.. ఆజంఖాన్ వ్యాఖ్యలకు జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్-లో కౌంటర్ ఇచ్చారు. 'స్మార్ట్ ఫోన్లు రాక ముందు మన దగ్గర అత్యాచారాలు, దుర్మార్గాలు లేనేలేవు కదా' అంటూ చమత్కరించారు. ఢిల్లీలో రామ్ లీలా నాటకం కొనసాగుతుండగా ఇద్దరు బాలురు రెండేళ్ల బాలికను అపహరించి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బాధిత చిన్నారి తీవ్రంగా గాయపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Azam Khan  Rape  Azam Khan news  Uttarpradesh  UP  Rapes in UP  

Other Articles