Man nabbed for picturising girls in Secunderabad

Youth nabbed for taking girls photos without thier concern

Secunderabad,railwaystation,Man,nabbed,picturising,cellphone,mmts rail, travellers, girls photos, police, arrest, case, investigation, Telangana, crime news, hyderabad city, photos, secundrabad railway station, railway police, youth nabbed, picturising

youth nabbed by railway police at secundrabad station for taking girls photos without their concern

ఫోటో క్లిక్ మనిపించాడు.. హాట్ కిక్ పంచులు తిన్నాడు

Posted: 10/24/2015 04:28 PM IST
Youth nabbed for taking girls photos without thier concern

సెల్‌ఫోన్‌లో అమ్మాయిల ఫొటోలు తీస్తూ రెండ్ హ్యాండెడ్‌గా చిక్కిన యువకుడిని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు ప్రయాణికులు. ఈ ఘటన శనివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే‌స్టేషన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఓ యువకుడు.. ఎంఎంటీఎస్ రైలు దిగి వస్తున్న ఓ అమ్మాయి ఫోటో తీశాడు. అయితే ఈ విషయాన్ని ఆ అమ్మాయి గమనించి తన ఫోటో ఎందుకు తీశామని నిలదీసింది. మొదట కాస్త దబాయించిన యువకుడి.. యువతికి అండగా తోటి ప్రయాణికులు గుమ్మిగూడటంతో పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు.

వెంటనే అతడి వద్ద సెల్‌ఫోన్ తీసుకుని చూడగా, సదరు యువతి ఫోటో అందులో వుంది. అంతేకాదు అమెతో పాటుగా చాలామంది అమ్మాయిల ఫొటోలు ఆ ఫోన్ లో వున్నాయి. స్టేషన్‌కు వచ్చే అందమైన యువతుల ఫొటోలను సెల్‌లో బంధిస్తున్నాడని గుర్తించిన ప్రయాణికులు ఆకతాయిని చితక బాదారు. ఆ తర్వాత స్థానిక రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అమ్మాయిల ఫోటోలను ఎందుకు తీస్తున్నాడనే విషయాన్ని పోలీసులు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : photos  secundrabad railway station  railway police  youth nabbed  picturising  

Other Articles