విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీలు టీఆర్ఎస్, టీడీపీ రెండూ ఏ విధంగా విమర్శల వర్షాన్ని కురిపించుకున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆ పార్టీల అధినేతలు కేసీఆర్, బాబు ఇద్దరూ ‘నువ్వా-నేనా’ అంటూ సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలోనే ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులు కూడా వెలుగులోకొచ్చాయి. ఆ దెబ్బతో వారిద్దరి మధ్య మరింత వైరుధ్యం పెరగనుందని, దాంతో రెండు రాష్ట్రాలు మరింత దూరమవుతాయని అప్పట్లో అనుకున్నారు. కానీ.. అందుకు భిన్నంగా ఏపీ రాజధాని ‘అమరావతి’ వారిరువుర్ని కలిపేసింది. పచ్చిగడ్డి వేస్తే భగ్గమనే వారిద్దరి శత్రుత్వాన్ని శంకుస్థాపనతో చల్లార్చింది. ఒకరినొకరు సోదరాభావంతో మెలుగుతున్నారు కూడా.
ఈ విధంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మైత్రిగా మెలగడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. నిన్నటిదాకా కత్తులు దువ్వుకునేలా విమర్వనాస్త్రాలు సంధించుకున్న సీఎంలు.. ఇప్పుడు స్నేహంగా నడుచుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ లోలోపలే ఏవో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. వీరిద్దరి మైత్రిపై తాజాగా స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు సంధించారు. ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కేసీఆర్, బాబుల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. త్వరలోనే వారిద్దరి మధ్య వున్న మధ్యవర్తి ఎవరనేది బట్టబయలు చేస్తామని చెప్పారు. తమ మోసాల్ని, కేసుల్ని కప్పిపుచ్చేందుకు ఆ సీఎంలిద్దరూ చేతులు కలిపారని విమర్శించారు. అయితే.. తాము అలా జరగనివ్వమని, ఇద్దరి రహస్యాల్ని బయటపెట్టితీరతామని వెల్లడించారు.
అలాగే.. ఏపీ పీ రాజధాని అమరావతి శంకుస్థాపన సభలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగంపై అసంతృప్తి వ్యక్తం చేవారు. ఆయన ప్రసంగం తెలుగు ప్రజలను నిరాశపరిచిందని, ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించకపోవడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర విభజన సరిగా జరగలేదన్న మోదీ ప్రకటనను కేసీఆర్ వ్యతిరేకించకపోవడం తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని అవమానపరచడమేనని, మోదీ పాదాల వద్ద తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ, చంద్రబాబు, కేసీఆర్ అబద్ధాల 0కిలాడీలేనని కాంగ్రెస్ నేతలు ఘాటుగా విమర్శించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more