a france husband forced his wife to have romance with 2700 men for money | prostitution cases | women slept with 2700 men

France husband forced his wife to have romance with 2700 men

wife forced to have romance with 2700 men, france husband forced wife to do prostitute, prostitution cases, women slept with 2700 men, women prostitution cases, france prostitute cases

france husband forced his wife to have romance with 2700 men : a france husband forced his wife to have romance with 2700 men for money.

డబ్బుకోసం భార్యను 2 వేలమందితో వ్యభిచారం..

Posted: 10/23/2015 05:00 PM IST
France husband forced his wife to have romance with 2700 men

పనీపాటా లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వచ్చిన ఓ కర్కశుడు.. పెళ్లైన తర్వాత కష్టపడి సంపాదించండం మానేసి తన భార్యతో వ్యభిచారం చేయిస్తూ ధనాన్ని ఆర్జంచడం పనిగా పెట్టుకున్నాడు. ఒకరిద్దరితో కాదు.. ఏకంగా 2,700 మందితో తన భార్యను వ్యభిచారం చేయించాడు ఆ భర్త. తనతో ఈ పాడు పని చేయించొద్దని భార్య ఎంతగా మొత్తుకున్నప్పటికీ.. అతగాడు వినలేదు. ఈ విషయం ఎవరికి చెప్పినా చంపేస్తానంటూ బెదిరించడంతోపాటు కొట్టేవాడు కూడా. అతని వేధింపులు తాళలేక ఆమె మౌనంగానే అన్ని భరిస్తూ వచ్చింది. చివరికి అతని బండారం పోలీసులకు తెలియడంతో.. అతని భార్య ఊపిరి పీల్చుకుంది.

ప్యారిస్ కు చెందిన ఓ వ్యక్తికి చాలాకాలం క్రితమే ఓ అందమైన మహిళతో పెళ్లయ్యింది. తొలుత ఆమెతో ఆనందంగా జీవితాన్ని గడిపిన అతగాడు నిజస్వరూపం ఆమెకు ఏమాత్రం తెలియరాలేదు. భర్తే ప్రపంచంమంటూ అతని ప్రేమలో మునిగిపోయింది. ఆ తర్వాత అతని అసలు రంగు బయటపడింది. కొన్నాళ్లు మంచి భర్తగా నాటకమాడిన ఆ కర్కశుడు.. డబ్బుకోసం తన భార్యను బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడు. ఈ పని చేసేందుకు ఆమె అంగీకరించని నేపథ్యంలో ఇంట్లో బంధించి దారుణంగా కొట్టేవాడు. అతని వేధింపులు భరించలేకపోయిన ఆమె.. అతగాడు చెప్పినట్లుగానే వ్యభిచారం రొంపిలోకి దిగలేక తప్పలేదు. అలా నాలుగేళ్లలో రెండు వేల మందికి పైగా పరాయి మగాళ్ళకు తన భార్యను అద్దెకిచ్చాడు.

54 ఏళ్ళ ఆ ముసలోడు 46 ఏళ్ల తన భార్యను నెలకు అయిదు వేల పౌండ్లకు విటులకు తార్చాడు. ఈమె ఓ కారులో కూర్చోగానే.. అందులో వున్న ఐదేళ్ల పిల్లాడు విటులను పిలిచేవాడు. అలా ఎవరికి తెలియకుండా ఈ వ్యభిచారం తంతును నడిపేవాడు. అంతేకాకుండా క్లెయింట్ల నాలుగు ఇంటర్నెట్ సైట్లు, టెక్స్ట్ మెసేజ్‌లు వాడేవాడు. ఇంకొక విషయం ఏమిటంటే.. ఫ్రాన్స్‌లో వ్యభిచారం చట్టబద్దం కావడంతో అతగాడి దారుణానికి హద్దే లేకుండా పోయింది. అయితే.. సొంత భార్యను ఇలా డబ్బుకోసం తార్చడంతో దీన్ని నేరంగా భావించి ఆ ముసలాణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ముసలాడు చేసిన పనికి పదేళ్ల శిక్ష పడే అవకాశముంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : husband forced wife to prostitute  women slept with 2700 men  

Other Articles