Kaitlyn Regehr Gave Party To Man Who Saved Her In Bus When She Was Grabbed By A Man | women crime news

Woman gave party to man who saved her in bus when she was grabbed by man

Kaitlyn Regehr Bus Incident, Woman Finds Man Who Save Her In Bus, Woman gave party to man who save her, Kaitlyn Regehr mystery hero firat, Kaitlyn Regehr firat party, Kaitlyn Regehr firat party photos, Kaitlyn Regehr updates, Kaitlyn Regehr facebook, Kaitlyn Regehr firat news, man rescued woman in bus

woman gave party to man who saved her in bus when she was grabbed by man : Kaitlyn Regehr, 30, was travelling on a double decker bus in London when she was grabbed by a man. Luckily for her another passenger who she described as “tall, dark, and dapper with a beard”, came to her rescue before telling the attacker his actions were not acceptable.

కాపాడి మాయమైన వ్యక్తిని.. ఆ యువతి పట్టుకుంది!

Posted: 10/23/2015 08:31 PM IST
Woman gave party to man who saved her in bus when she was grabbed by man

తన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఓ అమ్మాయి బస్సు ఎక్కింది.. రాత్రి సమయం బాగా గడిచిపోవడంతో ఆ బస్సులో రద్దీ ఎక్కువగా లేదు. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ ఆకతాయి ఆ అమ్మాయి దగ్గరకు వచ్చాడు. అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అదే బస్సులో వున్న మరో వ్యక్తి వెంటనే స్పందించి.. అతనిని తిట్టరాని తిట్లతో కట్టడి చేశాడు. ఆపదలో వున్న ఆ అమ్మాయిని ఆపద్బాంధవుడిలా కాపాడాడు. అతని దెబ్బతో సదరు జులాయి వెనక్కు తగ్గాడు. ఈ ఘటన నుంచి తేరుకున్న ఆ అమ్మాయి తనను కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పుదామనేలోపే అతగాడు మాయమయ్యాడు. అతని కోసం గాలించినా కనిపించలేదు. దాంతో అతడ్ని ఎలాగైనా కలుసుకోవాలని భావించి.. సదరు యువతి సామాజిక మాధ్యమాలను ఆశ్రయించింది. చివరికి అతని ఆచూకి లభించగా.. ఆ యువతి అతడ్ని పట్టుకుని బీరు పార్టీ ఇప్పించడంతోపాటు తనను రక్షించినందుకు కృతజ్ఞతలు తెలిపింది.

లండన్ కాలేజీలో పీహెచ్ డీ చేస్తూ, ఓ టీవీ ప్రోగ్రామర్ గా పనిచేస్తున్న కత్లిన్ రెగర్ అనే యువతి గతవారం తన ఇంటికి చేరుకునేందుకు రాత్రివేళ ఓ బస్సు ఎక్కింది. బస్సులో రద్దీ లేకపోవడంతో, ఓ యువకుడు ఆమెను దగ్గరకు లాక్కొని అసభ్యంగా ప్రవర్తించాడు. అదే బస్సులో ఉన్న మరో వ్యక్తి, అతనిని తిట్టి కట్టడి చేశాడు. అంతలో తన గమ్యం రావడంతో అతను దిగిపోయాడు. ఆపదలో వున్న తనను ఏంజెల్ లా కాపాడి మాయమైన ఆ వ్యక్తిని.. ఎలాగైనా కలుపుసుకుని కృతజ్ఞతలు చెప్పాలని నిర్ణయించుకుంది. అలా భావించిన ఆమె.. 'మంచి రక్షకుడు' అని టైటిల్ పెట్టి జరిగినదంతా ఫేస్ బుక్ లో పంచుకుంది. ఎర్రగా ఉన్నాడని, గడ్డం మీసాలను అందంగా ట్రిమ్ చేసుకున్నాడని చెబుతూ, అతన్ని వెతకడంలో సహకరించాలని కోరింది. ఆమె పోస్టును 86 వేల మంది షేర్ చేసుకున్నారు. వారం రోజుల్లో అతనెవరో తెలిసిపోయింది. ఫిరాత్ ఓజ్ సెలిక్ అనే వ్యక్తి ఆమెను కాపాడాడని నెటిజన్లు పట్టేశారు. అతడిని కత్లిన్ కు కలిపారు. తనను కాపాడిన వ్యక్తి చివరికి దొరకడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. అతగాడిని వెంటనే హత్తుకుని..తనను రక్షించినందుకు థ్యాంక్స్ చెప్పుకుంది. అలాగే.. అతడికి బీర్ పార్టీ కూడా ఇచ్చింది. కాసేపు సరదాగా అతనితో కబుర్లు చెప్పుకుంది. మరోవైపు.. ఫిరాత్ చేసిన మంచి పనికి సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అతనిలాగే ప్రతిఒక్కరు స్పందిస్తే.. అమ్మాయిలపై అత్యాచార ఘటనలు తగ్గుముఖం పడుతాయని అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kaitlyn Regehr Firat  Woman Find mystery Hero  

Other Articles