Team India gave kick on Dasara festival

Team india gave kick on dasara festival

India, Sports, cricket, south africa, Team India, Mandela-Gandhi series, Dhoni, harbhajan, Kohli

India won the fourt one day international at chidambaram stadium, chennai. In this sourhafrica-india series india bagged second victory in this season.

దసరా నాడు కిక్ ఇచ్చిన టీమిండియా

Posted: 10/23/2015 08:40 AM IST
Team india gave kick on dasara festival

దసరా రోజున భారత ఆటగాళ్లు దంచికొట్టారు.కీలక వన్డేలో సౌతాఫ్రికాపై విజయం సాధించారు. పవిత్రమైన విజయదశమి రోజున.. దక్షిణాఫ్రికాతో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలో 35 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 300 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికాకు నిర్ధేశించింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన సౌతాప్రికా పరుగుల వేటలో చతికిలబడింది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు 264 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 35 పరుగుల ఆధిక్యంతో భారత్ విజయం సాధించింది. అంతకు ముందు భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఈ విజయంతో ఫ్రీడమ్ సిరీస్‌ను 2-2 తో భారత జట్టు సమం చేసింది.

చెన్నైలో చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక వన్డేలో భారత్ సమిష్టిగా రాణించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ జట్టు విరాట్‌ కోహ్లి 138తో విజృంభించగా..  నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 299 పరుగులు చేసింది. భారీ లక్ష్య చేదనలో భారత్‌ స్పిన్నర్ల ధాటికి తొలుత తడబడిన దక్షిణాఫ్రికా 88 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్‌ ఇన్నింగ్స్ ఆడిన డివిలియర్స్  సెంచరీ వృధా అయ్యింది. డివిలియర్స్ ఒంటరి పోరాటంతో జట్టు గెలుపుపై ఆశలు రేపాడు. అయితే జట్టు స్కోరు 233 వద్ద భువనేశ్వర్‌ బౌలింగ్‌లో డివిలియర్స్ అవుటైయాడు. దీంతో భారత్‌ జట్టుకు విజయం ఖాయమైంది. చివరికి దక్షిణాఫ్రికా 50ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులకే పరిమితమై భారత్‌కి స్వదేశంలో అపూర్వమైన విజయాన్ని కట్టబెట్టింది. ఈ సిరీస్ ను ఎవరు సొంతం చేసుకుంటారు అన్నది తేలాలంటే మాత్రం అక్టోబర్ 25వరకు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Sports  cricket  south africa  Team India  Mandela-Gandhi series  Dhoni  harbhajan  Kohli  

Other Articles