Roads got blood in Devaragattu of kurnool

Roads got blood in devaragattu of kurnool

Banni fete, Devaragattu, Kurnool, Dasara, Vijayadasami, stick fight

While Vijayadasami is celebrated with religious fervour all over, thousands of persons of Nerani thanda and Kothapet and adjoining villages resort to a fierce stick fight called Banni utsavam around midnight on Vijayadasami festival in Devaragattu village in Holagunda mandal in Kurnool district that leaves hundreds with bleeding injuries year after year. The Banni fete is held as part of festivities of Sri Mala Malleswara Swamy temple, situated atop an 800 feet high hillock.

రక్తం చిందించిన కర్రయుద్ధం.. ఈ మనుషులు మారరు

Posted: 10/23/2015 08:45 AM IST
Roads got blood in devaragattu of kurnool

పది గ్రామాలు.. వేల సంఖ్యలో ప్రజలు.. చేతిలో కట్టెలు.. కళ్లలో కసి.. దేవుడి పేరుతో నడుస్తున్న అతి దారుణం.. రక్తం ఏరులైపారుతున్నా. అవి లెక్కచేయకుండా కర్రలతో బాదుకునే పిచ్చి. ఇది కర్నూలు జిల్లా దేవరగట్టు దసరా ఉత్సవాల తీరు. కర్నూలు జిల్లా దేవరగట్టు దసరా ఉత్సవాలు ఎప్పటిలాగే రక్తసిక్తమయ్యాయి. పాన మల్లేశ్వర కల్యాణం తరువాత నిర్వహించే బన్ని ఉత్సవంలో 60 మందికి పైగా గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. దేవరగట్టులో స్వామి విగ్రహాలను సొంతం చేసుకునేందుకు పెరటికి, కొత్తపేట గ్రామాల మధ్య కర్రల సమయం తరతరాలు సంప్రదాయంగా మారింది. ఈ సందర్భంగా దాదాపు 10 గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో కర్రలతో అక్కడికి చేరుకుని ఆధిపత్యం కోసం పోరాటం చేస్తారు. అందులో భాగంగా ఇనుప రింగులు ఉన్న కర్రలతో  కొట్టుకుంటారు. విజయదశమి రోజు రాత్రంతా ఈ సమరం కొనసాగుతుంది. దాదాపు వెయ్యి మంది పోలీసులు బందోబస్తు మధ్య బన్నీ ఉత్సవం జరిగింది. కర్రలు తీసుకురాకుండా పోలీసులు ఎంత నియంత్రించినా ఫలితం కనిపించలేదు.

తలలు పగిలినా... రక్తాలు కారినా.... ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా... ఆ సంప్రదాయాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు కర్నూలు జిల్లా వాసులు. హోళగుంద మండలం దేవరగట్టులో దసరా సందర్భంగా బన్నీ ఉత్సవం పేరిట కర్రల సమరం ఆనవాయితీగా వస్తోంది.  మల్లేశ్వరస్వామి కళ్యాణోత్సవంతో పాటు భవిష్యవాణి కార్యక్రమాలు ముగిసిన తర్వాత... తెల్లవారుజామున బన్నీ ఉత్సవం ప్రారంభం అవుతుంది. ఆలయ ప్రాంగణానికి వచ్చే వేలాదిమంది ఓ విగ్రహం కోసం కర్రలతో దాడులకు దిగడం అనాదిగా వస్తున్న ఆచారం. పూర్వం దేవరగట్టు ఆలయానికి వచ్చేందుకు అటవీ మార్గంలో జంతువుల నుంచి హాని లేకుండా ఉండేందుకు కర్రలు తీసుకువచ్చేవారు. చీకటి కారణంగా దారి కన్పించేందుకు దివిటీలు తెచ్చేవారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. మాలమల్లేశ్వర స్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు భక్తితో ఆయా గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకున్నట్టుగా నాట్యం చేసేవారు. అది కాలక్రమేణా కక్షలు తీర్చుకునేందుకు, సంప్రదాయం పేరుతో రక్తం చిందేందుకు దారితీసింది. గత ఏడాది ఉత్సవాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈసారి కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉత్సవంలో దాదాపు నలభై మంది గాయపడగా వారిలో ఐదుగురి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Banni fete  Devaragattu  Kurnool  Dasara  Vijayadasami  stick fight  

Other Articles