Opposition parties teargetted Modi

Opposition parties teargetted modi

Modi, Chandrababu, Special status, ap, amaravati, Jagan, Raghuveera Reddy, Congress, YSRCP, AMaravati Inauguration

AP Opposition parties slams modi and chandrababu naidu. Modi didnt said even single word on special status. Jagan call to protest for not announcing special status.

వాళ్ల టార్గెట్ మోదీ... ఎందుకంటే స్పెషల్

Posted: 10/23/2015 08:32 AM IST
Opposition parties teargetted modi

ఆంధ్రుల నవ రాజధాని అమరావతి శంకుస్థాపన ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది. దేశ, విదేశ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏదో ప్యాకేజీనో లేదంటే ప్రత్యేక హోదా మీద మోదీ ప్రకటిస్తారని అందరూ ఆశతో వచ్చారు. కానీ మోదీ మాత్రం ప్రత్యేక హోదా ఊసెత్తకుండా.. తన ప్రసంగాన్ని ముగించారు. దీంతో విపక్షాలు విమర్శలకు పదును పెట్టాయి. ఇటు బాబు, అటు మోడీని టార్గెట్ చేశాయి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. అమరావతి శంకుస్థాపన వేదికపై నుంచి ప్రధాని మోడీ ప్రత్యేకహోదా ప్రకటన చేస్తారని, లేదంటే ఆర్థిక ప్యాకేజీ ప్రకటన చేస్తారని చాలా మంది భావించారు. కానీ అలా జరగకపోయేసరికి విపక్ష నేతలు నోటికి పదునుపెట్టారు. అదే సమయంలో ఆందోళనలకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు, మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలన్నారు. కేసుల నుంచి బయటపడేందుకే ప్రత్యేక హోదాను బాబు అమ్మేశారని ఆరోపించిన జగన్...మోడీని వదల్లేదు. మట్టి, నీళ్లు తెచ్చిన మోడీ.. హోదాపై ప్రకటన చేయడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఈ క్రమంలోనే నేడు ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజల ఆవేదన మోడీకి, బాబుకు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు జగన్. 5కోట్ల మంది ఆంధ్రుల ఆశలను నట్టేట ముంచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రధాని మోడీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో..ఏపీ కాంగ్రెస్ శ్రేణులు కూడా ఫైర్ అవుతున్నాయి. మోడీ తీరుకి నిరసనగా…ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన దిష్టి బొమ్మలు తగులబెట్టాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన రఘువీరా రెడ్డి.. మోడీ వస్తారని, ప్రత్యేకహోదాపై ప్రకటన చేస్తారని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తే..ప్రధాని మాటలతో మోసం చేశారని ఆయన ఆరోపించారు. ప్రధాని తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని, అందుకు ప్రతిగా ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని రఘువీరా పిలుపునిచ్చారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీ..స్పెషల్ స్టేటస్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Chandrababu  Special status  ap  amaravati  Jagan  Raghuveera Reddy  Congress  YSRCP  AMaravati Inauguration  

Other Articles