Telangana cm KCR will get different experience in Amaravati

Telangana cm kcr will get different experience in amaravati

Amaravati, KCR, Chanadrababu, Modi, Amaravati Inauguration, Amaravati function, Amaravati News, AMaravati updates

AP govt and ap people excellent hosting to Telangana cm KCR, who is going to Amaravati inauguration ceremony on Dasara.

కేసీఆర్ కు ఆంధ్రా ఆతిథ్యం ఎలా ఉంటుంది..?

Posted: 10/21/2015 01:23 PM IST
Telangana cm kcr will get different experience in amaravati

ఆంధ్రా వాళ్ల వల్లే మనకు అవకాశాలురావడం లేదని ఉద్యమించి చివరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్. ఆంధ్రా అనే మాటను కలలో కూడా వ్యతిరేకించే కేసీఆర్ ఆంధ్రా రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళుతున్నారు. ఏపి సిఎం నారా చంద్రబాబు నాయడు స్వయంగా వచ్చి కేసీఆర్ ను ఆహ్వానించడంతో వెళ్లకతప్పనిసరి పరిస్థితి. ఇక ఆంధ్రాకు వెళుతున్న కేసీఆర్ కు ఎలాంటి ఆతిథ్యం లభించనుంది.. ఇది అమరావతికి వస్తున్న వారి మధ్య జరుగుతున్న ఆసక్తికర చర్చ. ఇప్పటికే కేసీఆర్ అమరావతికి వెళ్లడం మీద రకరకాల వార్తలు వస్తున్న తరుణంలో మరి రేపు కేసీఆర్ కు ఎలాంటి అనుభవం ఎదురుకానుంది..? తెలుసుకోవాలంటే మొత్తం చదవండి.

చెడు జరిగినా అందులో కూడా మంచిని వెతుక్కోవడం అంటే ఇదే మరి. అది కేవలం ఆంధ్రులకు మాత్రమే సాధ్యం. ఏం జరిగినా తమ మంచికే అనుకున్న ఆంధ్రులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సాదరస్వాగతం పలుకుతున్నారు. ఇప్పటికే బెజవాడ గుంటూరుల్లో కేసీఆర్ కి స్వాగత కటౌట్లు, బేనర్లు కనిపిస్తున్నాయ్. దాదాపు పది కటౌట్లు బెజవాడ గుంటూరుల్లో ఉన్నాయంటే రాజధాని అక్కడ పరిస్థితి అర్థమవుతోంది. ఇలాంటివి చూసి ఇప్పుడు చిత్రమైన సంభాషణలు కూడా చేస్తున్నారు అమరావతి బెజవాడల్లో. ఇటు పక్కన లోకేశ్ అటు పక్కన కేసీఆర్. పైన చంద్రబాబు టీడీపీ నాయకులు మొత్తం అంతా మళ్లీ ఏకమయ్యారా ఏంటనే ఫీలింగ్ కలుగుతోందంటూ కులాసాగా చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్ కు మోదీ కన్నా అక్కడి ప్రజలు ఎక్కువగా ప్రాధాన్యత నిస్తున్నారు. అమరావతి శంకుస్థాపనలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కూడా కేసీఆర్ నిలువనున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles