kcr at police commemoration day in goshamahal

Double bedroom flats to police conistables kcr

CM KCR, Traffic staff, Police Department, 30 percent hiked salaries to traffic police, double bedroom flats to police conistables, double bedroom flats to home guards, double bedroom flats to Ex service men, pay tributes, police commemoration day,

Telangana chief minister KCR announces double bedroom flats to police conistables, home guards, Ex service men and others in telangana

పోలీసులకు డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు.. ట్రాపిక్ పోలీసులకు వేతనాల పెంపు

Posted: 10/21/2015 12:01 PM IST
Double bedroom flats to police conistables kcr

పోలీసులపై వరాల జల్లు కురిపించడం ముఖ్యమంత్రులకు పరిపాటిగా మారింది. అయితే ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీ అఫ్ ఇస్తానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తాను సీఎంగా బాధ్యతలను స్వీకరించిన తొలినాళ్లలో ప్రకటించారు. అయితే దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించడన్నట్లుగా సీఎం వరాలు కురిపించినా.. ఉన్నతాధికారులు మాత్రం సీఎం హామీ అమలుకు నోచుకోదని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఆ ఊసెత్తడమే కష్టమని అంటూ అడ్డుకుంటున్నారని తెలుస్తోంది.

తెలంగాణ వచ్చించి..  మా సీఎం మాపై వరాలు కురిపించారని సంబరపడిన పోలీసులు.. హామీలు నెరవేరక.. నెరవేరే మార్గం కానరాక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారడంతో.. ఇక తమ జీవన పరిస్థితుల్లో మార్ప అసాధ్యమనుకుంటున్నారు. అయితే ఇవాళ జరిగిన పోలీసు సంస్మరణ దినోత్సం వేడుకలో పాల్లోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తానిచ్చిన ఓ మాటను మాత్రం అములు చేసేందుకు కట్టుబడి వున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఫ్లాట్లలో పది శాతం పోలీసులకు ఇస్తామని సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటించారు.

కానిస్టేబుళ్ల జీతభత్యం రూ. 90 నుంచి 250కి పెంచుతామన్న హామీ ఇచ్చినా, ఎస్ఐలకు గెజిటెడ్ హోదా కల్పిస్తామని చెప్పినా, పోలీసులకు వీక్లీ ఆఫ్ లు కల్పిస్తామని, పోలిస్ క్వార్టర్స్ లో 100 శాతం వ్యాట్ మినహాయింపుతో నిత్యావసర సరుకుల విక్రయం జరుగుతుందని, ట్రాపిక్ పోలీసుకలు ప్రత్యేక అలవెన్సులు, అరోగ్య భద్రత కల్పన, పోలీసు సిబ్బందికి సోంతిటి కల నెరవేర్చుతామని గతంలో హామీలు గుప్పించినా.. వాటిలో ఏ ఒక్కటీ నేరవేర్చలేదు. అయితే రాష్ట్రంలోని  పోలీసు కానిస్టేబుళ్లకు, హెడ్ కానిస్టేబుళ్లకు, ఏఎసైలకు, హోంగార్డులకు, మాజీ సైనికులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లల్లో పదిశాతాన్ని కేటాయిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

ఎస్‌ఐ స్థాయి అధికారులకు మున్సిపాలిటీల్లో ఇళ్లస్థలాలు ఇస్తామన్నారు. ఇక ట్రాఫిక్‌ పోలీసులకు 30 శాతం అదనపు వేతనం ఇస్తామని కేసీఆర్‌ మరోమారు ప్రకటించారు. పోలీసులు కార్యకలాపాల కోసం త్వరలో బంజారాహిల్స్‌లో 24 అంతస్థులతో అధునాత భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఉగ్రవాదం, వైట్‌కాలర్‌ నేరాలు, మతతత్వ శక్తులను సహించేది లేదన్నారు. ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు సమాజం రుణపడి ఉందన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM KCR  Traffic staff  Police Department  pay tributes  police commemoration day  

Other Articles