Ahmed Manasra alive, 'improving,' video shows

Israel accuses abbas of incitement over false death claim

Ahmad Manasra, Palestinian boy, Israel, brytality, propaganda war, viral video, dead palestinian boy alive, unconditional love, Jews, love, Arabs, Quran, Israeli Patrol officers

The Government Press Office releases a video showing 13-year-old Ahmed Manasra in Hadassah Hospital at Ein Kerem, who stabbed two Israelis in Pisgat Zeev

ITEMVIDEOS: మనిషి చస్తుంటే చూస్తారా..? ఇది మనుషులు చేసే పనియేనా..?

Posted: 10/16/2015 10:42 PM IST
Israel accuses abbas of incitement over false death claim

మనిషిని సమాధి చేస్తారా..? ఇది మనుషులు చేసే పనియేనా అంటూ స్వర్గీయ ఎన్టీయార్ ఓ చిత్రంలో పాడిన పాట. కానీ ఇప్పుడాయన బతికే వుంటే.. మనుషులు చస్తుంటే చూస్తారా..? ఇది మనుషులు చేసే పనియేనా అని పాడేవారు. ఎందుకంటటే పదమూడేళ్ల బాలుడు నెత్తురోడుతూ నేల వాలిపోతుండగా.. మానవత్వంతో ఆదుకోవాల్సిన స్థానికులు కనీస కనికరం లేకుండా.. కసాయిలుగా మారారు.  బుల్లెట్ గాయాలతో  బాధపడుతున్న బాలుడికి అపన్న హస్తం అందించకపోగా.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి తిట్లు పురాణం విప్పాడు. 'చావురా.. చావు' అంటూ నెత్తుటి మడుగులో ఉన్న బాలుడిని తిట్టిపోశాడు. ఈ అమానుష వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది.

నిత్యం ఉప్పు-నిప్పులా ఉండే పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య తాజాగా నెట్ లోకి చేరిన ఈ వీడియో.. మళ్లీ ఉద్రిక్తతలను రేపుతున్నది. గత కొన్నాళ్లుగా ఇరుదేశాల మధ్య జరుగుతున్న దాడులతో ఈ ప్రాంతంలో అశాంతి నెలకొనగా... తాజా వీడియోతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇద్దరు ఇజ్రాయిలీలపై కత్తితో దాడి చేశాడనే ఆరోపణలతో 13 ఏళ్ల పాలస్తీనా బాలుడిపై ఇజ్రాయెల్ సైనికులు గత సోమవారం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దారుణంగా గాయపడ్డ  అహ్మద్ మనస్రా అనే బాలుడు చనిపోయాడని పాలస్తీనా చెబుతుంది, మరోవైపు అతడు బతికే ఉన్నాడని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఫొటోలు చూపించి ఇజ్రాయెల్ వాదిస్తున్నది. బాలుడిపై జరిగిన దారుణ దాడికి సంబంధించిన వీడియోను ఇటు ఇజ్రాయిలీలు, అటు పాలస్తీనా వాసులు పోస్టుచేసి.. తమదైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇజ్రాయెల్ సైన్యాల క్రూరత్వానికి, పైశాచికిత్వానికి ఈ వీడియో పరాకాష్ట అని పాలస్తీనా వాసులు పేర్కొంటుండగా.. పాలస్తీనాకు చెందిన పదమూడేళ్ల బాలుడు నుంచి కూడా తమకు ముప్పు పొంచి ఉందనడానికి ఈ ఘటన నిదర్శనమని ఇజ్రాయిలీలు పేర్కొంటున్నారు. ఇటీవల చోటుచేసుకున్న కత్తిపోటు ఘటనలు, హింసాత్మక ఆందోళనలు.. ఈ ప్రాంతంలో మళ్లీ తీవ్రస్థాయి తిరుగుబాటుకు దారితీసి.. మళ్లీ అశాంతి చోటుచేసుకునే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇటు పాలస్తీనా వాసులు, అటు ఇజ్రాయెల్ వాసులు ఆన్లైన్లో దాడులు, కాల్పులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తూ తీవ్రస్థాయి యుద్ధమే జరుపుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ahmad Manasra  Palestinian boy  Israel  brytality  propaganda war  viral video  

Other Articles