bar-tasmac-in-the-husband-calls-wife

Wife makes her husband stop boozing at coimbatore

liqour, wife makes her husband stops liquor, coimbatore wife and husband, coimbatore wife makes her husband stops liquor, Tasmac Bar, Husband, Wife, Coimbatore, wife at tasmac bar, wife welcome husband at tasmac bar in coimbatore, Tamilnadu brave wife, jaya kumar, villi,

A wife who is fed up of his husband boozing, straight away comes to the place where her husband boozes, makes a mess and wins atlast.

‘నా భర్త వస్తాడు.. ఇద్దరం కలిసి తాగుతాం’ బార్ లో భార్య హల్ చల్

Posted: 10/16/2015 10:40 PM IST
Wife makes her husband stop boozing at coimbatore

‘నా భర్త వస్తాడు.. ఇద్దరం కలిసి మందు తాగుతాం’ అదేంటి ఈ శీర్షిక ఏదో తేడాగా వుందే అనుకుంటే పోరబాటటే. శీర్షికలో కాదండీ ఈ కథలోనే తేడా వుంది. అదేంటి అంటరా..? తాగుబోతు భర్తను దారికి తెచ్చుకునే పనిలో భాగంగా ఓ భార్యమణి చేసిన సాహసం.. అంతా ఇంతా కాదు. తినబోయే ముందు రుచులు ఎందుకన్నట్లు.. ఈ కథను మీరే చదవండీ....మద్యానికి బానిసైన భర్తలో మార్పు తేవాలని అనుకుంది ఓ భార్యమణి. భర్త ఏక్కడ మద్యం తాగుతాడో తెలుసుకుని అతని కంటే ముందే అక్కడికెళ్లింది. భర్త రాగానే ‘ఇద్దరం కలిసి తాగుదాం రా..’ అని పిలవడంతో అతనితో పాటు అక్కడున్న మందుబాబులు అవాక్కయ్యారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కేఆర్‌జీ నగర్‌కు చెందిన జయకుమార్, విల్లి భార్యాభర్తలు. ప్రయివేటు కంపెనీలో పనిచేసే జయకుమార్ రోజూ ఫూటుగా మద్యం తాగి ఇంటి కి వచ్చేవాడు. కొన్నాళ్లుగా ఇంటి ఖర్చులకు సైతం ఇవ్వకుండా జీతం మొత్తాన్ని మద్యానికే తగలేస్తుండడంతో విసిగి పోయినన విల్లి మూడురోజుల పాటు భర్తకు తెలియకుండా రోడ్డులో అతన్ని అనుసరించింది. ఏ బార్ లో మద్యం తాగుతున్నాడో తెలుసుకుంది. బుధవారం భర్త కంటే ముందుగా టాస్మాక్ బార్ (ఆబ్కారీ శాఖ నిర్వహించే బార్)కు వెళ్లి మందుబాబుల నడుమ కూర్చుంది.

మందుబాబులు, టాస్మాక్ నిర్వాహకులు ఇక్క డి నుంచి వెళ్లిపోవాలని ఆమెను కోరినా పట్టించుకోలేదు. ‘నా భర్త వస్తాడు.. ఇద్దరం కలిసి తాగుతాం’ .అనటంతో వారు మిన్నకుండిపోయారు. కొద్దిసేపట్లో బార్‌కు వచ్చిన జయకుమార్ భార్యను చూసి బిత్తరపోయాడు. ‘ఎందుకు వచ్చావ్, వెళ్లిపో’ అంటూ గదమాయించాడు. ‘ఇద్దరం కలిసి తాగుదాం, నాకూఆర్డర్ ఇవ్వు’ అని ఆమె అనటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. చివరకు పోలీసుల సమక్షంలో జయకుమార్ చేత ‘ఇకపై తాగను’ అంటూ వాగ్దానం చే యించాక ఆమె శాంతించింది. ఇకపై తన భర్త మద్యం తాగేందుకు బార్‌కు వస్తే ఇక్కడే ధర్నా చేస్తానని విల్లి తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tasmac Bar  Husband  jaya kumar  villi  Wife  Coimbatore  

Other Articles