Govt ‘Surprised’ As Supreme Court Strikes Down NJAC Act

Sc strikes down national judicial appointments commission

India,Judiciary,legislation,National Judicial Appointments Commission,NDA,NJAC bill,Supreme Court,UPA,njac,supreme court,njac act,news world india

A five-judge constitutional bench has declared as “unconstitutional” the National Judicial Appointments Commission that replaced a decades-old collegium system of judges appointing judges in the Supreme Court and high courts.

దధ్దరిల్లే తీర్పునిచ్చిన సుప్రీం ధర్మాసనం.. కేంద్రం అశ్చర్యం

Posted: 10/16/2015 01:07 PM IST
Sc strikes down national judicial appointments commission

జడ్జీల నియామకంపై గత యూపీఏ ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన విధానం రాజ్యంగ విరుద్దమంటూ దద్దరిల్లిపోయే తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించింది. నేషనల్ జ్యూడిషియల్ అపాయింట్ మెంట్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని కొట్టిపారేసింది. పాత పద్ధతిలోని కొలీజియం ద్వారానే న్యాయమూర్తుల నియామకం జరుగుతుందని స్పష్టం చేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కొలీజియం వ్యవస్థను పక్కకు పెట్టి నేషనల్ జ్యూడిషియల్ కమిషన్ తీసుకొచ్చింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులు జస్టిస్ జెఎస్ కెహర్, జస్టిస్ జె చలమేశ్వర్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఏకే గోయల్ లతో కూడిన అత్యున్నత న్యాయస్థాన ధర్మసనం.. ఇరువర్గాల తరపు వాదనలను విన్న అనంతరం జులై 15న తీర్పును వాయిదా వేసింది.

యూపీఏ ప్రభుత్వం తీసుకోచ్చిన విధానాన్ని సమర్థిస్తూ ఎన్ డీఏ ప్రభుత్వం గత ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకోచ్చింది. అయితే ఈ విధానం ద్వారా జడ్జీల నియామకంలో రాజకీయ జోక్యం అథికమవుతోందని కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కీలక తీర్పును శుక్రవారం వెల్లడించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ వ్యవస్థను కొట్టి పారేస్తున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అయితే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నేషనల్ జూడిషియల్ అపాయింట్ మెంట్ కమిటీపై వెలువరించిన తీర్పతో తాము ఆశ్చర్యానికి గురయ్యామని కేంద్ర న్యాయశాఖ మంత్రి డి వి సదానంద గౌడ అన్నారు. అయితే ధర్మాసనం అంతకుముందు అమల్లో వున్న కాలోజియం వ్యవస్థను కొనసాగిస్తూ తీర్పును వెలువరించడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. తమకు కోర్టు తీర్పు కాఫీ అందలేదని, అర్డరు కాపీ అందిన తరువాత.. అందులో పేర్కోన్న సారాంశాన్ని బట్టి న్యాయ కోవిదులు, సీనియర్ మంత్రులు, ప్రధానితో చర్చించిన తరువాత న్యాయస్థానం తీర్పుపై నిర్ణయాన్ని తీసుకుంటామని సదానందగౌడ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : njac  supreme court  national judicial appointments commission  njac act  

Other Articles