Chandrababu about AP students in Hyderabad

Chandrababu about ap students in hyderabad

chandrababu Naidu, AP, Students, Telangana, scholarships, Telangana govt on AP students, No scholarships for students, students in AP, chandrababu Naidu about students, scholarships for ap students in Telangana

In a move to win over Andhra people living in Telangana — particularly Hyderabad and Rangareddy districts — AP chief minister N Chandrababu Naidu has decided to pay the tuition fee and extend scholarships to students who are native of the residual state

తెలంగాణలోని ఆంధ్రా విద్యార్థుల కోసం ఏపి కీలక నిర్ణయం

Posted: 10/16/2015 01:29 PM IST
Chandrababu about ap students in hyderabad

ఉమ్మడి రాష్ట్రం విడిపోయా రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. తెలంగాణ, ఏపిలు విడివిడిగా పరిపాలనను ప్రారంభించాయి. అయితే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఎంతో కాలంగా ఉంటున్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్లు ఇక్కడే సెటిల్ అయ్యారు. అయితే ఏపి మూలాలున్న వాళ్ల పిల్లలు ఎంతో మంది తెలంగాణలో చదువుకుంటున్నారు. ఏపిలో తెలంగాణ విద్యార్థుల సంఖ్య కన్నా తెలంగాణలో చదువుతున్న ఆంధ్రా విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో చదువుతున్న ఏపి విద్యార్థులకు ఫీజులను కట్టడానికి నిరాకరించింది. ఏపి విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్ షిప్ లు నిలిపివేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. నేటివిటి ఆధారంగా కేవలం తెలంగాణ వారికి మాత్రమే స్కాలర్ షిప అందేలా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంది. అయితే తెలంగాణలో ఉంటున్న ఏపి విద్యార్థులకు భరోసా కల్పిస్తూ.. తాజాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. దాదాపు 24, 540 మంది ఏపి విద్యార్థుల భవిష్యత్తు మీద ప్రభావం చూపే ఏపి ప్రభుత్వ నిర్ణయం ఏంటో తెలుసా.?

ఏపి, తెలంగాణ రాష్ట్రాలు కేవలం తమ విద్యార్థులకు మాత్రమే స్కాలర్ షిప్ లు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. దాంతో చాలా మంది ఏపి విద్యార్థులు నష్టపోతున్నారు. తెలంగాణలో ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న వాళ్లు స్కాలర్ షిప్ లు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే తాజాగా ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో చదువుతున్న ఏపికి చెందిన విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్ షిప్ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఏపి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ను త్వరలోనే ప్రారంభిస్తామని.. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ వెల్లడించారు. ఏపి విద్యార్థులకు మోరల్ సపోర్ట్ కోసం స్పెషల్ ఆఫీసర్లను నియమించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 24, 540 మంది ఏపి విద్యార్థులు చదువుతుండగా... ఏపిలో 3,200 మంది తెలంగాణ విద్యార్థులు చదువుతున్నారు. చంద్రబాబు నాయుడు నిర్ణయం మీద ఏపి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles