Lady acid attack on her boyfriend

Lady acid attack on her boyfriend

Acid Attack, Lady attack, Guntur, Tenali, Acid attack on man, Lady attack on Man

In guntur dist. of ap, A Lady attacked with acid on her boyfriend. Guntur dist. Tenali town placed for this incident.

అబ్బాయి మీద అమ్మాయి యాసిడ్ దాడి

Posted: 10/16/2015 12:50 PM IST
Lady acid attack on her boyfriend

ఆడవాళ్ల మీద దాడుల గురించి రాసీ.. రాసీ .. చూసీ. చూసీ అందరికి విసుగు వచ్చింది. దేశంలో ఎక్కడ చూసినా ఆడవాళ్ల  మీద మగాళ్లు అలా దాడికి దిగారు.. అమానుషంగా ప్రవర్తించారు అంటూ నిత్యం వార్తలు వింటూనే ఉంటాం.. ఎన్నొ ఘటనలను ప్రత్యక్షంగా చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఆడవాళ్లు అన్నింటా ముందుకు దూసుకువెళుతున్నారు. మగాళ్లకు మేమేం తక్కువా అంటూ అన్ని రంగాల్లో విజయపథంలో దూసుకెళుతున్నారు. మరి అన్నింటిలో దూసుకెళుతున్నప్పుడు క్రైంలో మాత్రం ఎందుకు వెనుకబడాలి. తాజాగా ఓ ఘటన గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అమ్మాయి తన ప్రియుడి మీద కోపంతో యాసిడ్ తో దాడి చేసింది. ఈ ఘటన జరిగింది కూడా ఎక్కడో. కాదు ఏపిలొ.. అది కూడా గుంటూరు జిల్లాలో.

అమ్మాయిలు చూడడానికి నీళ్లలాగా కనబడతారు.. కానీ కోపం వస్తే యాసిడ్ లాగా మారిపోతారు అని ఈ లైన్ ను అమ్మాయిలకు వర్తించే టైం వచ్చేసింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెంకటేశ్వర్వు అనే వ్యక్తి, ఓ మహిళ చాలా కాలంపాటు ప్రేమించుకుంటున్నారు. అయితే వెంకటేశ్వర్లు మరో అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడని తెలుసుకొని.. ఆగ్రహంతో ఊగిపోయింది. ఇంకే ముందు అతడి మీద యాసిడ్ తో దాడి చేసింది. దాంతో వెంకటేశ్వర్ల మొహం కాలిపోవడంతో పాటు, శరీరంలో చాలా భాగాలు కాలిపోయినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటి దాకా ఈ ఘటన మీద ఎలాంటి కేసు నమోదు కాలేదని సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలే చూడాల్సి వస్తుందేమో మరి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Acid Attack  Lady attack  Guntur  Tenali  Acid attack on man  Lady attack on Man  

Other Articles