palvai govardhan reddy slams KCR

Palvai govardhan reddy slams telangana cm kcr

Palvai Govardhan Reddy, KCR, telangana CM, Telangana, farmers, Suicides, Tughlaq

palvai govardhan reddy slams telangana cm KCR. Palvai govardhan reddy describe telangana cm KCR as tughlaq. He slams the telangana govt policies on farmers.

కేసీఆర్ ను తన్ని రాజీనామా చేయించాలట

Posted: 10/15/2015 08:45 AM IST
Palvai govardhan reddy slams telangana cm kcr

కేసీఆర్ ప్రభుత్వం మీద అసమ్మతి నేతలు తమ గళాన్ని విప్పుతున్నారు. కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి లాంటి నేతలు అయితే కేసీఆర్ ను బండ బూతులు తిడితే.. తాజాగా మరో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌.. ఓ పిచ్చి ముఖ్యమంత్రి. గ్రామగ్రామాన తన్ని రాజీనామా చేయించండి అని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్‌ అతి తెలివిమంతునిగా వ్యవహరిస్తూ... పైగా నీటిపారుదల అధికారులకు తెలివి లేదనుకుంటున్నారని విమర్శించారు. సగం తెలివితో కేసీఆర్‌ ప్రమాదకర వ్యక్తిగా తయారయ్యారన్నారు. గత 18 నెలల టీఆర్‌ఎస్‌ పాలన అట్టర్‌ ఫ్లాప్‌ అని, సీఎం ఆధునిక తుగ్లక్‌ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిజానికి తుగ్లక్‌  ఉద్దేశాలు బాగున్నా... అమలు చేయడంలో విఫలం అయ్యారని అన్నారు.  కానీ కేసీఆర్‌ విషయంలో అవి అమలే కావని విమర్శించారు

రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాక నష్టపరిహారం ఇస్తే ఏం లాభం? ఆత్మహత్యలు జరగక ముందే ఆదుకోవాలని కేసీఆర్‌పై మండిపడ్డారు పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి. ఏపీ, తెలంగాణలో ఆత్మహత్యల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని, రుణ మాఫీని రెండు రాష్ట్రాలూ సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. చంద్రబాబు, ఎన్టీఆర్‌లు శ్రీశైలం టన్నెల్‌ వద్దన్నా... కష్టపడి దాన్ని సాధించామని, దాని పనులు 80 శాతం పూర్తయ్యాయని, మరో 20 శాతం పనులు తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతోందని విమర్శించారు.డిండి వద్ద నక్కలగండి ప్రాజెక్టు కట్టి అక్కడ నుంచి చెరువులకు నీరు పంపించాలని, దాని వల్ల నల్గొండ జిల్లాకు సాగు నీరు, త్రాగు నీరు లభిస్తుందని తెలిపారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యూనల్‌ను అడ్డం పెట్టుకొని వైఎస్‌ నక్కలగండికి...గండి కొట్టారని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మించలేకపోతుందని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Palvai Govardhan Reddy  KCR  telangana CM  Telangana  farmers  Suicides  Tughlaq  

Other Articles