Police can shoot chain sneakers

Police can shoot chain sneakers

chain snatching, Hyderbad, Cyberabad, Police, Shoot, chain sneakers, Anand, CP Anand, Cyberabad commissioner of police

Cyberabad commissioner of police Anand clear that police can shoot chain sneakers. From the last few days chain snatching cases filed a lot.

వాళ్లను కాల్చివెయ్యవచ్చు అంటున్న సైబరాబాద్ సీపీ

Posted: 10/15/2015 09:01 AM IST
Police can shoot chain sneakers

అవును. కనిపిస్తే కాల్చివేతలాగా.. చైన్ స్నాచర్ల మీద పోలీసలు కాల్పులు జరపవచ్చు అని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ఆనంద్ వెల్లడించారు. గతంలో జరిగిన ఘటనలను అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. మైదరాబాద్  చైతన్యపురిలో కరుడు గట్టిన ఛైన్ స్నాచర్ లంబాసింగ్ పట్టుకునే సమయంలో అతను కత్తితో ఎదురుదాడికి దిగడంతో చైతన్యపురికి చెందిన ఓ కానిస్ట్టేబుల్ తీవ్ర గాయాలకు గురయ్యాడు. అదే విధంగా సైబరాబాద్ పోలీసులకు దొరికిన ఇరానీ గ్యాంగ్ విచారణలో కూడా స్నాచింగ్‌కు వెళ్ళేటప్పుడు చిన్న చిన్న మారణాయుధాలు, కత్తులు, నకుల్ డస్టర్‌లను వెంట పెట్టుకుంటున్నాయి. దాంతో పోలీసులకు వాళ్లను పట్టుకునేందుకు భయమేస్తోంది. సమాచారం అందించినా కానీ ఆలస్యంగా అక్కడికి చేరుకోవడం.. చైన్ స్కాచర్లను పట్టుకోవడంలో చిత్తశుద్ది లేకపోవడంతో పేట్రేగిపోతున్నారు.

దీంతో స్నాచర్లను వెంటపడి పట్టుకునేందుకు సిబ్బంది వెనుకంజ వేస్తున్నారని గుర్తించారు. ఈ విషయాన్ని సీపీ ఆనంద్‌తో ఉన్నతాధికారులు చర్చించినప్పుడు సాను కూలంగా స్పందించారు. ఈ చేజర్ టీమ్‌లకు వెపన్‌లను అందించేందుకు అంగీకరించారు.అదేవిధంగా ఈ టీమ్ సిబ్బందికి హైస్పీడు బైక్‌లను అందిస్తు న్నారు. దీని కోసం ఈ సిబ్బందికి స్పీడు డ్రైవింగ్‌తో చేజింగ్ చేయడం, స్నాచర్ల దాడుల నుంచి తప్పించుకుని ఆత్మరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవా లనే అంశాలపై ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. మొత్తానికి ఇక మీదట చైన్ స్నాచింగ్ చెయ్యాలంటే భయపడేలా సైబరాబాద్ కమీషనర్ ఆదేశాలు ఉన్నాయి. చైన్ స్నాచింగ్ చెయ్యాలనుకునే కేటుగాళ్లు కాస్త ఆలోచిస్తే బాగుంటుందేమో మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles