We will go to inauguration of Amaravati

We will go to inauguration of amaravati

Telangana, Ap, KTR, Amaravati, Inauguration of Amaravati, KTR on Amaravati, Chandrababu Naidu, KCR

Telangana Minister KTR told that if ap govt invite them, they will go to the inauguration of the ap capital city Amaravati. KTR hope that ap, Telangana has to develope as Ambani brothers.

అమరావతికి పిలిస్తే వస్తామంటున్న కేటీఆర్

Posted: 10/15/2015 08:39 AM IST
We will go to inauguration of amaravati

తెలుగు రాష్ట్రాల మధ్య కాస్త ఎడమొహంగా సాగుతున్న సంబందాలను పక్కన బెట్టి మంచి కార్యానికి మంచి మనసుతో ఆశిర్వదిస్తామని అంటున్నారు మంత్రి కేటీఆర్. చంద్రబాబు నాయుడు ఏపి కేబినెట్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రిని స్వయంగా వెళ్లి కలుస్తానని వెల్లడించిన నేపథ్యంలో కేటీఆర్ మాటలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ముందు నుండి కేటీఆర్ చంద్రబాబు నాయుడును టార్గెట్ గా చేస్తూ.. విమర్శలు గుప్పించారు. కానీ తాజాగా అమరావతి విషయంలో మాత్రం తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యవహారం అందరికి కొత్తగా అనిపిస్తోంది. అయితే రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే సంబందాలు చెడిపోయిన నేపధ్యంలో ఇక వైరం వీడి చెలిమి కోరుతున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానిస్తే తప్పకుండా వెళతాం.. ఆశీర్వదిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరావత శంకుస్థాపనకు ఆహ్వానిస్తే తప్పకుండా వెళతామన్నారు. మంచి మనసుతో ఆశీర్వదిస్తామని తెలిపారు. విజయవాడతో పాటు పలు నగరాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. విభజన జరగకపో యుంటే అభివృద్ధి సాధ్యమయ్యేదా? అని ప్రశ్నించారు. అంబానీ సోదరుల మాదిరిగా తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కెటిఆర్‌ ఆకాంక్షించారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల మధ్య సంబందాలు మరింత బలపడడానికి అమరావతి శంఖుస్థాసన కార్యక్రమమే వేదికనిస్తుందేమో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Ap  KTR  Amaravati  Inauguration of Amaravati  KTR on Amaravati  Chandrababu Naidu  KCR  

Other Articles