KCR approved the layout of Yadadri

Kcr approved the layout of yadadri

KCR, Yadadri, Yadagiri Gutta, telangana, KCR on Yadadri, Yadadri Temple, Yadagiri Gutta in Telangana, Yadagiri LaxmiNarasimha Swamy

KCR approved the layout of Yadadri. Telangana cm KCR order to construct the Yadadri temple as a master piece. He approved the layout of the Yadadri.

యాదాద్రి ఇక అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రం

Posted: 10/15/2015 08:27 AM IST
Kcr approved the layout of yadadri

యాదాద్రికి మహాదశ పట్టనుంది. తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రిని అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చాలని సిఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా దసరా తర్వాత అభివృద్ది పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి గుట్టు, చుట్టూ ఇతర గుట్టల అభివృద్ధి కోసం తయారు చేసిన లే అవుట్లను క్యాంపు కార్యాలయంలో పరిశీలించి, ఆమోదించారు. ఈ డిజైన్ల ప్రకారం దసరా నుంచి పనులు ప్రారంభించాలని అధికారులను కోరారు. ఆమోదించిన డిజైన్లు, లే అవుట్ ప్రకారం గుట్ట పైన గర్భగుడి యథావిధిగా ఉంటుంది. గుట్టపైకి పోవడానికి, కిందికి రావడానికి వేర్వేరు దారులుంటాయి. ప్రస్తుతమున్న దారిని గుట్టపైకి పోవడానికి, కొత్తగా నిర్మించే దారికి కిందికి రావడానికి ఉపయోగిస్తారు. విఐపిలకు ప్రవేశమార్గం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రధాన ఆలయం చుట్టూ మాడ వీధులు నిర్మిస్తారు. దీని విస్తీర్ణం 2.3 ఎకరాలుంటుంది. శివాలయానికి కూడా మాడవీధులు నిర్మిస్తారు. ప్రధాన ఆలయం తూర్పు దిక్కున దక్షిణానికి అభిముఖంగా 108 అడుగుల ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్టిస్తారు. గుట్టపైనే అన్నదానం కాంప్లెక్స్ నిర్మాణం ఉంటుంది.

బ్రహ్మోత్సవం జరిగేందుకు కూడా తూర్పు భాగంలో ప్రత్యేక స్థలం ఉంటుంది. అర్చకులు సేద తీరేందుకు, బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక స్థలం గుట్టపైనే ఉంటుంది. శ్రీచక్ర భవనం ప్రాంగణాన్ని క్యూ కాంప్లెక్సుగా మారుస్తారు. దైవ సంబంధ వస్తువుల విక్రయం కోసం గుట్టపైనే షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. గుట్టపైన ఉన్న ప్రస్తుత భవనాలన్నీ తొలగిస్తారు. కొత్త లే అవుట్ ప్రకారమే నిర్మాణాలుంటాయి. నీటి గుండం యధావిధిగా ఉంటుంది. దాని విస్తీర్ణం పెంచుతారు. ప్రధాన గుట్ట పక్కన ఉన్న ఇతర గుట్టల అభివృద్ధి ప్రధాన గుట్టకు తూర్పు భాగాన వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రెండు గుట్టలను కలిపి యాదగిరిగుట్ట టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తారు. టెంపుల్ సిటీలో విశాలమైన రహదారులు, ఉద్యానవనాలు, కాటేజీలు, సత్రాలు, పార్కింగ్ ప్లేస్, కళ్యాణ మంటపం నిర్మిస్తారు. గుట్ట పరిసరాల్లో సువాసనలు వెదజల్లే మొక్కలు పెంచుతారు. భక్తి గీతాలు, శ్లోకాలు నిరంతరం వినిపించే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. పనుల అనుమతులు, తదితర విషయాలన్నీ వైటిడిఏ చూసుకుంటుందని, పనుల్లో జాప్యం ఉండవద్దని కేసీఆర్ ఆదేశించారు. రెండు బడ్జెట్లలో కలిపి రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించామని, భవిష్యత్తులో మరిన్ని కేటాయింపులు చేస్తామని సిఎం చెప్పారు. పాత భవనాలు, కాటేజీలు కూల్చివేసే సందర్భంలో ఇదివరకు కాటేజీలు నిర్మించిన దాతల పేరుతోనే కొత్త డిజైన్ల ప్రకారం సత్రాలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles