Marine Police| Sri Lankan fiberglass boat| abandoned| seized

Sri lankan fishing vessel seized in india

Sri Lankan fishing vessel seized in India, Coastal Security Group, Marine Police, 18-foot-long fishing boat, 25 HP outboard engine, Sri Lankan fiberglass boat, abandoned srilanka boat near rameshwaram, abandoned srilanka boat shallow waters off Vadakadu

Marine Police of the Coastal Security Group in Tamil Nadu has seized a Sri Lankan fiberglass boat found ‘abandoned’ in the shallow waters off Vadakadu near Rameshwaran

రామేశ్వరంలోకి చోరబడ్డ తీవ్రవాదులు.. జల్లెడ పడుతున్న పోలీసులు

Posted: 10/14/2015 10:18 PM IST
Sri lankan fishing vessel seized in india

తమిళనాడులోని రామేశ్వరంలోకి తీవ్రవాదులు జొరపబడ్డారు. ఈ విషయంపై పక్కా సమాచారం వుండడంతో పోలీసులు పరిసర ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శ్రీలంక నుండి రామేశ్వరం వడక్కాడు వద్ద సముద్రతీరానికి ఫైబర్‌ పడవలో వచ్చినట్లు జాలరులు పోలీసులకు సమాచారం అందించారు. తీరానికి రాగానే వారు జనావాస ప్రాంతాల్లోకి పరుగులు తీశారని, అయితే వారు ఎంతమంది అన్నది చీకట్లో గుర్తించలేకపోయామని జాలరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అంతేగాక దుండగులు వదిలి వెళ్లిన ఫైబర్‌ పడవను కూడా వారు పోలీసులకు స్వాధీనం చేశారు. దీంతో రామేశ్వరంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ పోలీసులు, సముద్ర తీర భద్రతాదళం ఏడీఎస్పీ జ్ఞానశివకుమార్‌ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌కుమార్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు జోతిబసు, రాజ్‌కుమార్‌, ఆరుముగం తదితరులు హుటాహుటీన అక్కడికి చేరుకుని పరిశీలించారు. సముద్రతీరంలో వున్న 18 అడుగుల పొడవు, ఏడడుగుల వెడల్పు వున్న ఆ ఫైబర్‌ పడవ శ్రీలంకకు చెందినదిగా వారు గుర్తించారు. ఆ పడవపై ఓఎఫ్‌ఆర్‌పీఎఎంఎన్‌ఆర్‌ 1303 అనే రిజిసే్ట్రషన్‌ నెంబర్‌ ఉంది. ఆ పడవలో ఒక ఇంజన్‌, వలలను నీటిపై తేలియాడించే పరికరాలు లభించాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Marine Police  Sri Lankan fiberglass boat  abandoned  seized  

Other Articles