A Name Surfaces for NDA Chief Minister

A name surfaces for nda chief minister

Prem Kumar, Shahnawaz Hussain, Gaya, Gaya MLA, Bihar chief ministerial candidate, Patna, Narendra Modi, Bihar polls, Bihar chief ministerial elections

As the first of the five-phase elections in Bihar started, BJP's star campaigner Shanawaz Hussain said today that the party's veteran lawmaker from Gaya, Dr Prem Kumar, will be the chief minister if the NDA comes to power in the state. The statement was a departure from tradition for the party, which rarely announces its chief ministerial candidate in advance.

బీహార్ బీజేపీ సిఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్

Posted: 10/12/2015 06:01 PM IST
A name surfaces for nda chief minister

బీహార్ లో  ఎన్డీఏ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రిగా  డాక్టర్ ప్రేమ్ కుమార్ ఎన్నిక కావచ్చు. ఆయన బీహార్ లో గయ నుంచి పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. తొలిదశ పోలింగ్ నేపథ్యంలో  కేంద్ర మంత్రి, బీజేపీ స్టార్ కాంపైనర్ షానవాజ్ హుస్సేన్  ఈ విషయాన్ని వెల్లడించారు.  ప్రేమ్ కుమార్ బీహార్ లో  సామాజికంగా,  విద్యాపరంగా వెనుకబడిన తరగతులు – ఈబీసీ- కి చెందిన వారు.  బీహార్ లో తొలిదశ పోలింగ్ పూర్తవుతున్న నేపథ్యంలో  షానవాజ్ హుస్సేన్ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన  పార్టీ సంప్రదాయానికి విరుద్ధంగా ప్రకటించినదే. బీజేపీలో  ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ముందుగా ప్రకటించడం అరుదే.

గయలో పార్టీ ప్రచారసభలో షా నవాజ్ హుస్సేన్ ఈ ప్రకటన చేశారు. గయనుంచి పోటీ చేస్తున్న డాక్టర్ ప్రేము కుమార్ ను పెద్దమెజారిటీతో గెలిపించాలని, ఆయన ఎన్డీఏ  సీఎం అభ్యర్థి కాగలరని షా నవాజ్ హుస్సేన్ ప్రకటించారు.   బీహార్ లో  ఇప్పటివరకూ  ప్రధాని నరేంద్రమోదీ,  అభివృద్ధి అంశాన్నే ప్రచారం చేస్తూ వచ్చారు. తప్ప సీఎం అభ్యర్థి పేరును ప్రకటించలేదు.  గయ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ ప్రేమ్ కుమార్.   సీఎం అభ్యర్థి అంటూ ఇప్పటికే సోషల్ నెట్ వర్క్ లో ప్రచారం జరుగుతోంది.  ఈబీసీ కి చెందిన ఆయనను సీఎం అభ్యర్థి గా ప్రకటించినా,  ప్రదానంగా గతంలో ప్రతిపక్షనాయకుడిగా ఉన్న  సుశీల్ మోదీ  సీఎం అభ్యర్థిగా  పోటీ పడుతున్నారు.  విజేతలెవరో  ఎన్నికల తర్వాతే తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles