Ink attack by Sena activists on Kulkarni

Ink attack by sena activists on kulkarni

Ink attack, Kulkarni, Pakistan, shivasena, Sudheendra Kulkarni, ORF chairman, Mumbai, Advani, BJP, Book launch

Shiv Sena activists today allegedly smeared black ink on the face of ORF chairman Sudheendra Kulkarni for organising former Pakistan foreign minister Khurshid Mahmud Kasuri's book launch in Mumbai. "Shiv Sena activists threw ink at me and smeared my face. They abused me," Kulkarni alleged and said that his Observer and Research Foundation (ORF), a foreign policy think-tank, will hold Kasuri's book launch as planned in Mumbai later today.

పుస్తకావిష్కరణలో రచ్చ.. రంగు పడింది

Posted: 10/12/2015 06:02 PM IST
Ink attack by sena activists on kulkarni

పాక్ మాజీ విదేశాంగ మంత్రి కసూరి పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ సాయంత్రం జరుగనుంది. అబ్జర్వర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ నేతృత్వంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగనుంది. మరోవైపు ఈ కార్యక్రమంపై శివసేన పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ నిర్వాహకులు పుస్తకావిష్కరణకు సిద్ధమయ్యారు. ఇందుకు నిరసనగా ఓఆర్‌ఎఫ్ ఛైర్మన్ సుదీంద్ర కులకర్ణి ముఖానికి శివసేన కార్యకర్తలు సిరా పూశారు.  పాకిస్థాన్ మాజీ మంత్రి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించొద్దని నిరసన వ్యక్తం చేస్తూ ఓఆర్‌ఎఫ్ చైర్మన్ సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు ఇంకు దాడి చేశారు. ఇంక్ మరకలతోనే కులకర్ణి ప్రెస్‌మీట్ పెట్టారు. పాక్ మాజీ మంత్రి కసూరి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించొద్దని శివసేన బెదిరిస్తున్నది... శివసేన బెదిరింపులకు భయపడేది లేదు... సాయంత్రం 5.30 గంటలకు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగి తీరుతుందని కులకర్ణి తేల్చిచెప్పారు. కులకర్ణిపై ఇంక్ దాడి దురదృష్టకరమని పాక్ మాజీ మంత్రి కసూరి పేర్కొన్నారు.

పాకిస్థాన్ మాజీ మంత్రి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించొద్దని నిరసన వ్యక్తం చేస్తూ ఓఆర్‌ఎఫ్ చైర్మన్ సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు ఇంకు దాడి చేసిన విషయం విదితమే. కులకర్ణిపై ఇంకు దాడిని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఖండించారు. ఇంకు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇలాంటి ఘటనలతో దేశానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో భిన్నమైన అభిప్రాయాలకు అవకాశం ఉండాలి. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు. కాగా శివసేన నాయకులు దీన్ని సమర్థిస్తున్నారు. పాకిస్థాన్ రాసిన మన సౌనికుల రక్తపు మరకలు కనిపించడం లేదు కానీ.. ఓ వ్యక్తి మీద వేసిన సిరా మరకలు కనిపిస్తున్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ink attack  Kulkarni  Pakistan  shivasena  Sudheendra Kulkarni  ORF chairman  Mumbai  Advani  BJP  Book launch  

Other Articles