After Treatment Doctors Said YS Jagan May Go In Coma | YS Jagan Hunger Strike | AP Special Status

Ys jagan may go in coma doctors treatment hunger strike

ys jagan latest news, ys jagan hunger strike, ys jagan controversies, ys jagan updates, ys jagan sensational news, ys jagan photo gallery, ys jagan strike, ys jagan deeksha, ys jagan coma, ap special status

YS Jagan May Go In Coma Doctors Treatment Hunger Strike : After Treatment Doctors Said YS Jagan May Go In Coma.

కోమాలోకి వైఎస్ జగన్? సర్వత్రా ఆందోళన!

Posted: 10/12/2015 04:15 PM IST
Ys jagan may go in coma doctors treatment hunger strike

ఆంధ్రప్రదేవ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత వైఎస్ జగన్ ఆరురోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఐదోరోజే కాస్త క్షీణంచిన ఈయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మరింత విషమించిందని వైద్యులు తెలిపారు. కీటోన్స్ 3+ స్థాయికి చేరుకున్నాయని వారు తేల్చి చెప్పారు. కీటోన్ బాడీస్ పాజిటివ్ అంటేనే ప్రమాదకరం అని, 3+ అంటే మరింత విషమం అని వైద్యులు తెలిపారు. దీనివల్ల శరీరంలో మొత్తం అన్ని వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని అన్నారు. ఆయన కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా వుందని.. గుండె, కిడ్నీలు, మెదడు మీద ప్రభావం పడుతుందని చెప్పారు. కీటోన్ బాడీస్ అనేవి అసలు శరీరంలో ఉండకూడదని, కానీ ప్రస్తుతం అవి వైఎస్ జగన్ శరీరంలో 3+ స్థాయిలో ఉన్నాయని చెప్పారు.

వైద్య పరీక్షల వివరాలను గుంటూరు ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ రమేశ్ తెలిపారు. ఆయన పల్స్ రేటు 68, బీపీ 130/80, బరువు 72.9, బ్లడ్ షుగర్ 84, కీటోన్స్ 3+ అని ఆయన వివరించారు. ఆదివారం మధ్యాహ్నం గానీ, రాత్రి గానీ కీటోన్ బాడీస్ పరీక్ష చేయలేదని చెప్పారు.  సోమవారం మధ్యాహ్నం జీజీహెచ్ వైద్యులు మరోసారి  మీడియా సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో దీక్ష విరమిస్తే మంచిదని వైద్యులు తెలిపారు. అటు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం జగన్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయన్ను దీక్ష విరమించాలని కోరారు. కానీ.. ఆయన మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. ప్రత్యేక హోదా గురించిన ప్రకటన వస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనైనా దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పేశారు.

మరోవైపు.. జగన్ ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు, వైకాపా శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ తల్లి విజయమ్మ హైదరాబాద్ నుంచి గుంటూరుకు బయలుదేరగా.. బెంగళూరులో వున్న జగన్ సోదరి షర్మిల కూడా అక్కడి నుంచి పయనమయ్యారు. కాగా ఫాస్టింగ్ బ్లడ్ సుగర్ - 61; బ్లడ్ యూరియా - 26; సీరమ్ క్రియాటిన్ -1; టోటల్ బైలురూబిన్ - .6, ఎస్జీఓటీ- 44; ఎస్జీపీటీ - 20; ఆల్కలైన్ - 75; సోడియం - 150; పొటాషియం - 5.1; క్లోరైడ్స్ - 106; బైకార్బనేట్స్ - 13 చొప్పున ఉన్నాయి. అంతకుముందు తీసుకున్న ర్యాండమ్ బ్లడ్ సుగర్ విలువలు సరిగా రావని, అందుకే ఫాస్టింగ్ బ్లడ్ సుగర్ పరీక్ష చేశామని డాక్టర్ రమేశ్ వివరించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan hunger strike  ys jagan coma news  ap special status  

Other Articles