YS Jagan caught red handedly

Ys jagan caught red handedly

Jagan, Jagan Mohan Reddy, Hunger Strike, Guntur, Special Status, AP

YS Jagan caught red handedly. On Hunger strike, Jagan Mohan Reddy caught red handedly. Jagan Mohan reddy sugar levels caught original information about his hunger strike.

జగన్ ను పట్టించిన 59-83

Posted: 10/12/2015 09:57 AM IST
Ys jagan caught red handedly

వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఆరు రోజులగా ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో దీక్షకు దిగారు. అయితే నిరాహార దీక్షలో పాల్గొన్న జగన్ మీద అధికార పక్షానికి చెందిన నాయకులు, మంత్రులు రకరకాల విమర్శలు చెయ్యడం మామూలే. ఎందుకంటే ప్రతిపక్షంలోని నాయకులు ఏం చేసినా అది అధికారపక్షానికి ఏ మాత్రం కరెక్ట్ అనిపించదు. అందుకే ఏపి మంత్రులు, స్వయంగా సిం చంద్రబాబు నాయుడు జగన్ మీద విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు కూడా జగన్ మీద తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. జగన్ తన మీద ఉన్న కేసులను ఎత్తివేయాలనే దీక్షకు దిగారని.. అంతే తప్ప రాష్ట్రానికి ప్రయోజనం కలిగించాలని మాత్రం కాదు అని అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు కేబినెట్ లోని ఓ మంత్రిగారు జగన్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వివరించారు. దాంతో జగన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలు ఈ 59-83 సంగతేంటి.? జగన్ గురించి వెలుగులోకి వచ్చిన విషయం ఏంటి..? తెలుసుకోవాలంటే మొత్తం చదవండి.

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయి తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపికి గతంలో అధికారంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటించింది.. కానీ చట్టంలో మాత్రం దాన్ని చేర్చలేదు. అయితే దీని మీదే ప్రతిపక్ష నాయకుడు జగన్ దీక్షకు దిగారు. ఏపికి ప్రత్యేక హోదా ఆక్సిజన్ లాంటిదని అంటున్నారు. అందుకోసమే తాను దీక్షకు దిగుతున్నానని ప్రకటించి.. గత ఆరు రోజులుగా గుంటూరు వేదికగా దీక్షకు దిగారు. కాగా జగన్ చేస్తున్న దీక్ష మీద మంత్రి కామినేని శ్రీనివాస్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కామినేని జగన్ కు సంబందించి 59-83 నంబర్లను వెల్లడించారు. ఇంతకీ 59-83 ఏంటో తెలుసా..? జగన్ దీక్ష చేస్తున్న క్రమంలో అతడికి చేసిన రక్త పరీక్షల్లో భాగంగా వెల్లడైన షుగర్ లెవల్స్. దీక్షలో భాగంగా ఐదో రోజు చేసిన పరీక్షల్లో భాగంగా షుగర్ లెవెల్స్ ముందు 59గా నమోదయ్యాయి. కానీ తర్వాత నిర్వహించిన పరీక్షలో మాత్రం షుగర్ లెవల్స్ 83కి పెరిగాయి. దీన్నే మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి ఆహారం తీసుకోకపోతే జగన్ షుగర్ లెవల్స్ పెరగవు అని.. అంటే జగన్ ఆహారం తీసుకుంటూ దొంగ దీక్ష చేస్తున్నారని అన్నారు. మొత్తానికి జగన్ వ్యవహారాన్ని ఇలా షుగర్ లెవల్స్ బయటపెట్టేశాయి. అయినా ఇలా జనాన్ని జగన్ మోసం చెయ్యడం ఏంటని కొంత మంది పెదవి విరుస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Jagan  Jagan Mohan Reddy  Hunger Strike  Guntur  Special Status  AP  

Other Articles