Minister Taking Bribe

Minister taking bribe

Awadhesh Prasad Kushwaha, JD(U), Nitish Kumar, Sharad Yadav, Bihar, elections, Modi, BJP, Bihar CM, Nitesh kumar on Awadhesh, Minister Taking Bribe

Bihar minister Awadhesh Prasad Kushwaha resigns after sting operation shows him accepting Rs 4 lakh bribe. A day after a sting operation showed him accepting advance money from a businessman, JDU leader Awadhesh Kushwaha has resigned from Nitish Kumar's cabinet. JDU chief Sharad Yadav said that the party asked for Kushwaha's resignation and has forwarded it to the Governor.

ITEMVIDEOS: లంచం ఇస్తూ పట్టుబడ్డ మంత్రి.. తలపట్టుకున్న సిఎం

Posted: 10/12/2015 09:27 AM IST
Minister taking bribe

అవును.. మంత్రి వర్గంలోని ఓ మంత్రి గారి నిర్వాకానికి తలపట్టుక్కూర్చున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. వెంటనే మంత్రి గారి దగ్గరి నుండి రాజీనామా చేయించారు. లంచం ఇస్తూ పట్టుబడ్డ మంత్రి వల్ల ఎలక్షన్ లో తమకు నష్టం కలుగుతుందని తెగ భయపడుతున్నారు ఆ ముఖ్యమంత్రి. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారా.? బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. బీహార్ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు ముందు జేడీయూకు పెద్ద షాక్ తగిలింది. నితీశ్‌కుమార్ క్యాబినెట్‌లోని మంత్రి అవధేశ్ ప్రసాద్ కుష్వాహా లంచం తీసుకుంటూ స్టింగ్ ఆపరేషన్‌కు చిక్కిన వీడియో బహిర్గతమైంది. దీంతో వెంటనే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని జేడీయూ జాతీయ అధ్యక్షుడు శరద్‌యాదవ్ ధ్రువీకరించారు.

ఎన్నికల్లో కుష్వాహా నామినేషన్ వేసిన నియోజకవర్గంలో ఆయన స్థానంలో నామినీగా ఉన్న వ్యక్తిని తమ పార్టీ అభ్యర్థిగా పరిగణిస్తామన్నారు. కుష్వాహాపై ఆరోపణలను విశ్వసించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీజేపీలా ముఖ్యమంత్రులు అవినీతికి పాల్పడినా చర్య తీసుకోకుండా ఉండలేదన్నారు. ఓ కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరించేందుకుగాను కుష్వాహా రూ.4 లక్షల లంచం తీసుకుంటున్నట్టుగా వీడియోలో రికార్డయింది. అయితే తనపై పెద్ద కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. అయితే దీన్ని కూడా నితీష్ కుమార్ వర్గం బిజెపి మీద ఆయుధంగా వాడుతోంది. నితీష్ కుమార్ అవినీతికి తావివ్వడు కాబట్టే.. ఇలా మంత్రిని వెంటనే కేబినెట్ నుండి తప్పించారు. మరి మోదీ లాగా బిజెపి ముఖ్యమంత్రులే అవినీతికి పాల్పడినా చర్యలు తీసుకోకుండా ఉండలేదు అని ఎద్దేవా చేస్తున్నారు. మరి దీని ప్రభావం ఎలక్షన్ లో ఎంత మేరకు ఉంటుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles