China Father Wrote Agreement To Burnt His Assets Without Giving Son After His Death Which Goes Viral Worldwide | Assets Fight In Families

China father wrote agreement to burnt his assets without giving son after his death

assets fight, assets fight in families, families assets fight, father burnt his assets without giving sons, father assets agreement

China Father Wrote Agreement To Burnt His Assets Without Giving Son After His Death : China Father Wrote Agreement To Burnt His Assets Without Giving Son After His Death. This Incident Attract Everyone In The Worldwide.

తండ్రీకొడుకుల ఆస్తి గొడవ.. 21 లక్షలు బుగ్గిపాలు!

Posted: 10/12/2015 10:38 AM IST
China father wrote agreement to burnt his assets without giving son after his death

ప్రస్తుత ఆధునిక యుగంలో యువత ఎటువంటి జీవన విధానాన్ని ఎంచుకుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమ స్వంత ప్రయోజనాల కోసం తల్లిదండ్రుల మాట పట్టించుకోకపోవడం, ఆస్తికోసం వారితో గొడవ పడటం, ఇంకా ఎన్నో వివాదాలకు యువత తావిస్తోంది. ఎంతో ప్రేమగా తమను ఆలనాపాలనా చూసుకుంటూ, పెంచి పెద్దగా చేసిన తల్లిదండ్రుల ప్రేమానురాగాల కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే.. ఆస్తికి సంబంధించిన తగాదాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే.. తాజాగా వెలుగులోకొచ్చిన తండ్రీకొడుకుల ఆస్తిగొడవ చాలా ఆసక్తికరంగా మారింది. వృద్ధాప్యంలో తనని నిర్లక్ష్యం చేసిన కొడుకులకు ఓ తండ్రి వారికి తగిని శాస్తి చేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన తావో అనే వృద్ధాప్యుడికి ఇద్దరు కొడుకులు వున్నారు. జీవితాంతో ఎంతో కష్టపడి వారి ఆలనాపాలనా చూశాడు. ఎంతో ప్రేమతో వారిని పోషించి, పెద్ద చేశాడు. పది సంవత్సరాల కింద తన పొలాలన్నీ కొడుకులకు అప్పగించి వేరే చోట ఇల్లు అద్దెకు తీసుకుని చిన్న పాటి ఉద్యోగం చేసుకుంటూ కాలం వెళ్లదీసేవాడు. అనంతరం తన వృద్ధాప్య జీవితాన్ని తన కొడుకుల దగ్గరే వుంటూ గడుపుదామని భావించాడు. దాంతో అతను తన కొడుకుల దగ్గరకు వెళ్లగా.. తమ వద్ద ఉండొద్దంటూ వారిద్దరూ చెప్పేశారు. అంతే! ఆ తండ్రీ ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడు. వృద్దాప్యంలో తనను నిర్లక్ష్యం చేసిన ఆ కొడుకులకు తగిన శాస్తి చేయాలనుకుని.. తన సంపాదనలో ఒక్క రూపాయి కూడా వారికి దక్కకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు.

జీవితాంతం తాను కష్టపడి సంపాదించిన డబ్బు కొడుకులకు దక్కకూడదని, ఆ డబ్బంతా తనతో పాటే కాల్చేయాలని పేర్కొంటూ వీలునామా రాశాడు. ఆ వీలునామా ప్రకారం.. ఇటీవల ఆయన చనిపోతే దాదాపు రూ.21 లక్షలు ఆయనతోనే కాల్చేశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరిని ఆకర్షించింది. కళ్లుమూసుకుపోయిన ఆ ఇద్దరు కొడుకులకు తండ్రి తగిన శాస్తే చెప్పాడంటూ అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : assets fight in families  china father burnt his assets after death  

Other Articles