KCR between Dasara and Ugadi

Kcr will complete that between the dasara and ugadi

KCR, Telangana, Erravalli, Double Bed rooms, Ugadi, Dasara, Double Bed rooms by Ugadi, KCR on Double Bed Rooms

KCR will complete that between the Dasara and Ugadi. Telangan cm KCR said that he will complete the doulble bed rooms in Erravalli village of medak dist. He assure the people of Errabelli on double bed rooms.

దసరా, ఉగాది మధ్యలో కేసీఆర్

Posted: 10/12/2015 08:24 AM IST
Kcr will complete that between the dasara and ugadi

దసరా, ఉగాది పండుగలు తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పండుగలు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దసరాకు ఉగాదికి మధ్యన ఓ పని ఖచ్చితంగా చేస్తానని అంటన్నారు. దసరా నాడు ప్రారంభించి ఉగాది నాటికి ఖచ్చితంగా పూర్తి చేస్తానని, ఉగాది నాడు ప్రారంభ వేడుకలో పాల్గొంటానని అంటున్నారు. ఇంతకీ కేసీఆర్ ఏం చేస్తారు అని అనుకుంటున్నారా..? ఉగాది నాటికి మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. సొంత నియోజకవర్గం పరిధిలో దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేటలో కేసీఆర్ గ్రామసభలు నిర్వహించారు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా రెండు గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలో పర్యటించారు. ఉగాది నాటికి గ్రామంలో రెండు పడకల ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. భూ కమతాల ఏకీకరణ చేసేందుకు గ్రామస్థులు సహకరించాలని కోరారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా కలిసి కట్టుగా కదిలినప్పుడు అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. ఎర్రవల్లి తెలంగాణ మొత్తానికి ఆదర్శంగా నిలవాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకాన్ని రెండు గ్రామాలకూ వర్తింపజేయాలని కేసీఆర్ ఆదేశించారు.  నాలుగైదు నెలల్లోనే డబుల్ బెడ్ రూంల నిర్మాణ పనులు పూర్తి చేసుకునే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తానికి రెండు పండగల మధ్య డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేస్తానని మాత్రం బల్లగుద్ది మరీ చెబుతున్నారు కేసీఆర్. చూడాలి మరి ఏం చేస్తారో..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles