YSRC Chief Jaganmohan Reddy Continues Indefinite Fast on 5th Day

Ys jagan s health declines on day 5 of indefinite fast

ysrcp, ys jagan, indefinite fasting, special status, samara deksha, health bulletin, Jaganmohan Reddy,Andhra Pradesh,Special status,YSR Congress party,TDP,Indefinite fast,Chandrababu

The indefinite fast by YSR Congress party president YS Jaganmohan Reddy for special status to Andhra Pradesh entered its fifth day today.

ఐదో రోజుకు చేరిన జగన్ దీక్ష.. రెండు కేజీలు తగ్గిన విఫక్ష నేత..

Posted: 10/11/2015 03:38 PM IST
Ys jagan s health declines on day 5 of indefinite fast

నవ్యాంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ తో అమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఐదవ రోజు క్షీణించింది. ఐదు రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండడంతో ఆయన ఆరోగ్యాన్ని పరిశీలించి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ నాగభూషణ్ రెడ్డి ఆదివారం వైఎస్ జగన్కు పరీక్ష చేశారు. రక్త నమూనాను సేకరించారు.

దీని ప్రకారం ప్రస్తుతం వైఎస్ జగన్ శరీరంలో చక్కెర (షుగర్ లెవల్స్) స్థాయి 83కు, నాడీ(పల్స్ రేట్) 67కు పడిపోయింది. ఇక అంతకుముందు ఆయన 75 కేజీలకు పైగా ఉండగా ప్రస్తుతం ఆయన బరువు 73.4 కేజీలకు తగ్గింది. మొత్తం రెండు కేజీల బరువు వైఎస్ జగన్ తగ్గినట్లు వైద్యులు తెలిపారు. ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవడంతో గంటగంటకు ఆయన శరీరంలోని బీపీ, షుగర్, పల్స్ స్థాయిల్లో మార్పు వస్తుందని వైద్యులు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  ys jagan  indefinite fasting  special status  samara deksha  

Other Articles