Police may break Jagan hunger protest

Police may break jagan hunger protest

Jagan, AP, Special status, YS Jagan, Hunger Strike, Hunger stike for special status, Status for AP, Jagan for special status

Police getting ready to broke YS Jagan hunger strike today or tomorrow. jagan protesting from this month 7th. jagan demanding for special status for the state of ap.

జగన్ దీక్ష ఎప్పుడైనా భగ్నం కావచ్చు

Posted: 10/12/2015 08:49 AM IST
Police may break jagan hunger protest

ప్రత్యేక హోదా డిమాండ్ తో జగన్ చేస్తున్న ఆమరణ దీక్ష ఆరో రోజుకు చేరింది. దీక్ష ప్రారంభించి వంద గంటలు దాటడంతో... జగన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. దీంతో దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దీక్షాస్థలి వద్ద పార్టీ ముఖ్యనేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ.. జగన్ చేపట్టిన దీక్ష ఉద్రిక్తతను రగిలించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా ఆంధ్రా హక్కు అంటూ... గుంటూరులోని నల్లపాడు రోడ్డులో ఈ నెల 7వ తేదీన జగన్ ప్రారంభించిన దీక్ష నిన్నటితో ఐదు రోజులు పూర్తి చేసుకుంది. వంద గంటలకు పైగా దీక్షలో ఉండడంతో.జగన్.. బాగా నీరసించిపోయారు. ఐదు రోజుల్లో మూడు కిలోల బరువు తగ్గారు. షుగర్, బీపీ లెవల్స్ పడిపోయాయి.

జగన్ ఆరోగ్యం పట్ల పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీక్షాప్రాంగణంలో సమావేశమై భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. నిరసనలు తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. టీడీపీ నేతలకు కేంద్ర మంత్రి పదవుల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను పట్టించుకోవడం లేదని రోజా ఆరోపించారు. మోడీకి పార్లమెంటరీ వ్యవస్థపై నమ్మకం ఉంటే ప్రత్యేక హోదాను ప్రకటించాలని పార్థసారధి డిమాండ్ చేశారు. అయితే.. జగన్ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో... ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అటు ఎప్పుడైనా దీక్షను భగ్నం చేసే యోచనలో ప్రభుత్వ వర్గాలున్నట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో దీక్షా ప్రాంగణం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు.. షుగర్ లెవల్స్ విషయంలో అధికార పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఏమీ తినకపొతే పడిసోయిన షుగర్ లెవల్స్ ఎలా పెరుగుతాయని మంత్రి కామినేని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles