11 more free wi fi spots in the hyderabad

Hyderabad a free wi fi city soon

hyderabad a free wi-fi city soon, Telangana Government, minister KT RamaRao, free wi-fi, hyderabad, BSNL, free wi fi spots, wi-fi to attract tourists,

hyderabad a free wi-fi city soon, government to locate 11 more free wi fi spots to attract tourists in the city

హైదరాబాద్ లో మరో 11 పర్యాటక ప్రాంతాల్లో ఫ్రీ వై-ఫై టవర్లు..!

Posted: 10/09/2015 05:25 PM IST
Hyderabad a free wi fi city soon

దేశంలోనే తొలి పూర్తి స్థాయి వై ఫై నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని మరో 11 పర్యాటక, జనరద్దీ గల ప్రాంతాల్లో ఉచిత వై ఫై సేవల విస్తరణకు బీఎస్‌ఎన్‌ఎల్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే 20 ప్రాంతాల్లో ఉచిత వై ఫై సేవలు అందిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్... డిసెంబర్ 31 లోగా పూర్తి స్థాయిలో ఉచిత వై ఫై సేవలను విస్తరించాలని నిర్ణయించింది. హాట్ స్పాట్స్ లో ఉచిత వై ఫై సేవల ద్వారా ప్రతి రోజు  80 నుంచి 100 జీబీ వరకు డాటా వినియోగమవుతోంది. చార్మినార్ వద్ద అత్యధికంగా వినియోగమవుతుండగా, ప్రతిరోజు సుమారు రెండు వేల మంది వరకు ఉచిత సేవలను వినియోగిస్తున్నట్లు అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

ఇటీవల ఒక సోషల్ మీడియా నిర్వహించిన సర్వేలో బీఎస్‌ఎన్‌ఎల్ సేవలకు  బెస్ట్ రేటింగ్ లభించింది. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు మరింత ఉత్సాహంతో ఉచిత వై ఫై సేవల విస్తరణ పనులను వేగవంతం చేశారు. ప్రస్తుతం మూడు రకాలుగా హాట్ స్పాట్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సౌలభ్యం మేరకు స్మాల్, మీడియం, లార్జ్ హాట్‌స్పాట్‌ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. ఒక్కో హాట్‌స్పాట్‌కు ఐదు వైఫై టవర్స్, ఒక్కో టవర్ ఐదు నుంచి పది కిలో మీటర్ల మేర సేవలు అందించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం పది కిలోమీటర్లకు ఒక జోన్‌గా పరిగణిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : free wi-fi  hyderabad  BSNL  

Other Articles