amma rajashekar and team manhandled me alleges neighbour

Neighbour filed complaint against director

neighbour filed complaint against amma rajashekar, tollywood director, amma rajashekar, neighbour, appartment, manhandled, venkat reddy,

FIR booked against Director Amma Rajashekar and team for manhandling a neighbour of his appartment

దర్శకుడిపై కేసు నమోదు.. దాడి చేశాడంటూ యువకుడు పిర్యాదు

Posted: 10/09/2015 01:34 PM IST
Neighbour filed complaint against director

టాలీవుడ్, కోలీవుడ్ కొరియో గ్రాఫర్‌ అమ్మా రాజశేఖర్‌ వివాదంలో చిక్కుకున్నారు. మద్యం మత్తులో తనపై దాడి చేశాడని కింది ఫ్లోర్‌లో ఉంటున్న జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్న వెంకట్ రెడ్డి పోలీసులకు పిర్యాదు చేశాడు. టీవీ సౌండ్‌ తగ్గించాలని కోరినందుకు తనపై దాడి చేశారని ఆయన చెప్పారు. ఎల్లారెడ్డిగూడలో అమ్మరాజశేఖర్ వుండే ఫ్లాట్ కింది అంతస్థులో వెంకటరెడ్డి అద్దెకు వుంటున్నారు. టీవి సౌండ్ ఎక్కువగా పెడుతున్నారనే విషయంలో అమ్మరాజశేఖర్-వెంకటరెడ్డిల మధ్య ఇటీవలే చిన్నపాటి ఘర్షణ జరిగింది. దీంతో పెద్దలతో గొడవలెందుకని తాను ముందుజాగ్రత్తగా తన ఇంటిని ఖాళీ చేసానని వెంకట్ రెడ్డి తెలిపాడు. అయితే తన వినతిని పెడచెవిన పెట్టి మరీ తనపై దాడులకు తెగబడుతున్నారని అరోపించారు.

గత ఆదివారం కూడా ఒకసారి చెప్పానని ఆ సమయంలో రాజశేఖర్‌లేరని కారు డ్రైవర్‌ ఉన్నాడని, అతను మద్యం సేవించిన మత్తులో అమర్యాదగా మాట్లాడినా తాను ఊరుకున్నానని వెంకట్ చెప్పాడు. రెండు రోజుల తర్వాత వచ్చిన రాజశేఖర్‌ తో తానే అయన డ్రైవర్ పై దాడి చేశానని డ్రైవర్ అబద్దాలు చెప్పడంతో దానిని నమ్మిన ఆయన.. జిమ్ములో ఉన్న తనను పిలిపించి.. అతను సహా అతని అనుచరులందరూ కలిసి తనపై దాడి చేసి కొట్టారని వెంకట్రెడ్డి తెలిపాడు. కాగా, అమ్మా రాజశేఖర్‌ మాట్లాడుతూ అతనిని మేము ఎందుకు కొడతామని అన్నారు. ఆయనను కొట్టాల్సిన అవసరం తమకు లేదని, తన పనేదో తాను చేసుకు పోతానని, ఎవరి విషయంలో జోక్యం చేసుకోనని ఆయన చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood director  amma rajashekar  neighbour  appartment  manhandled  

Other Articles