Tomorrow Telangana bandh

Today rally and tomorrow bandh in telangana

Telangana, Bandh, Opposition parties, BJP, Congress, TDP

Today rally and tomorrow bandh in Telangana. Opposition parties in telangana call for rally today and telangan state bandh tomorrow. TDP, Congress, BJP, YSRCP and Communist parties call for tomorrow bandh.

తెలంగాణలో నేడు ర్యాలీ.. రేపు బంద్

Posted: 10/09/2015 08:40 AM IST
Today rally and tomorrow bandh in telangana

తెలంగాణలో అన్ని విపక్షాలు ఏకమయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ గా చేస్తూ అన్ని పక్షాలు సమరశంఖం పూరిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తున్న ప్రధాన ప్రతిపక్షాలు నేడు, రేపు నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు అంతా సిద్దమవుతున్నాయి. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాల పార్టీలైన కాంగ్రెస్, టిడిపి, బిజెపి పార్టీలతో పాటు సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులు, వైసీపీ నాయకులు కూడా ప్రభుత్వం మీద తమ నిరసనను వ్యక్తం చేస్తు నేడు ర్యాలీ నిర్వహించనున్నాయి. రైతుల రుణాలు ఏకకాలంలో మాఫీ చెయ్యాలని డిమాండ్ చేస్తూ నేడు ర్యాలీ నిర్వహించడంతో పాటుగా రేపు బంద్ నిర్వహించేందుకు అన్ని విపక్షాలు కట్టుదిట్ట ఏర్పాట్లు చేస్తున్నాయి.

రేపు తెలంగాణ వ్యాప్తంగా గట్టిగా బంద్ ను నిర్వహించాలని.. అందుకు అన్ని పార్టీల నాయకులు తమ శ్రేణులకు తగిన సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వైఖరి వల్ల నష్టపోతన్న రైతుల పరిస్థితిని వివరిస్తు... ప్రజలను కూడా బంద్ లో పాలుపంచుకునేలా చెయ్యాలని అన్ని విపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. తెలంగాణ జిల్లాలతో పాటుగా హైదరాబాద్ లో కూడా బంద్ ను పకడ్ బందీగా నిర్వహించేందుకు విపక్షాలు సిద్దమవుతున్నాయి. కాగా బంద్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లకు సిద్దమవుతున్నారు. మొత్తం మీద నేడు, రేపు రెండు రోజుల పాటు రాష్ట్రంలో నిరసన, బంద్ కార్యక్రమాలు సాగనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Bandh  Opposition parties  BJP  Congress  TDP  

Other Articles