Spencer Stone hailed as a hero after an attack on a French train has been stabbed in California | France Train Attack Hero

France train attack hero spencer stone stabbed in us

spencer stone attacked, spencer stone stabbed, france train attack hero spencer, spencer stone stabbed in us, train attack in france, spencer stone hero attacked

France Train Attack Hero Spencer Stone Stabbed In US : Spencer Stone, hailed as a hero after an attack on a French train, has been stabbed in Sacramento, California. He was attacked while defending a friend, an Air Force.

వందలమందిని రక్షించిన హీరోని చావగొట్టారు!

Posted: 10/09/2015 10:04 AM IST
France train attack hero spencer stone stabbed in us

అతని పేరు స్పెన్సర్ స్టోన్.. సైనికుడిగా విధులు నిర్వహిస్తున్న ఆ వ్యక్తి.. గత ఆగస్టు నెలలో ఫ్రాన్స్ లో ప్రయాణిస్తున్న రైలుపై జరిగిన ఉగ్రదాడిని నిలువరించి హీరోగా నిలిచాడు. దాంతో అతనికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. అతనిలాంటి సైనికులుంటే సాధారణ ప్రజలకు ఎటువంటి ప్రమాదం వుండదంటూ ప్రజలు నినాదాలు చేసిన సందర్భాలూ కూడా వున్నాయి. అయితే.. ఇంతలోనే ఏం జరిగిందో ఏమోగానీ ఆ హీరోని ఎవరో చావగొట్టేశారు. గురువారం తెల్లవారుఝామున కాలిఫోర్నియా సమీపంలోని సాక్రామెంటోలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అతనిపై హఠాత్తుగా దాడి చేసి, చాలా దారుణంగా కొట్టి పడేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన స్టోన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఉందని వైద్యులు తెలిపారు.

మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. గత ఆగస్టులో స్టోన్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి పారిస్ లో హైస్పీడ్ రైల్లో ప్రయాణిస్తుండగా, తుపాకీ కాల్పులు వినిపించాయి. దాంతో అలర్ట్ అయిన వాళ్లు.. చుట్టు పక్కల గమనించగా వారికి ఆయుధాలు ధరించిన వ్యక్తులు ప్రయాణికులను బెదిరిస్తూ కనిపించారు. దీంతో రంగంలోకి దిగిన వీరు.. చాలాచక్యంగా వారితో పోరాడి వందలాది మందిని రక్షించి ప్రశంసలు పొందారు. ఆ ఘటనతో వారంతా.. ముఖ్యంగా స్టోన్ హీరోగా పేరుగాంచాడు. అటువంటి సైనికుడి మీద గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కొందరు దుండగులు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ దాడికి సంబంధించి వివరాలు ఏమీ చెప్పలేమంటూ అధికారులు వెల్లడించారు. ఓ అల్లరిమూక కావాలనే అతనిపై దాడి చేసి వుండవచ్చని తెలుస్తోంది. కానీ.. రైలు ప్రయాణం ఘటనలో ఇతని చేత దెబ్బలు తిన్నవారే ఈ దాడికి పూనుకుని వుంటారని అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : spencer stone hero stabbed  france train attack hero  

Other Articles