Modi on top gear

Narendra modi gearup in for bihat elections

Bihar, Modi, Lalu Prasad Yadav, Narendra Modi on Lalu, Bihar Elections, Bihar elections news, Bihar news, Modi on Nitest kumar

Narendra Modi Gearup in for Bihat elections. Pm Narendra Modi gearup for the prestigious bihar elections. Modi conduct four meetings in one day. Modi target Lalu and other leaders in the elections

టాప్ గేర్ లో దూసుకెళుతున్న మోదీ

Posted: 10/09/2015 08:39 AM IST
Narendra modi gearup in for bihat elections

బీహార్ మొదటిదశ ఎన్నికలు దగ్గరపడడంతో ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ ఒకే రోజు నాలుగు భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో అవకాశవాదులకు, అహంకార నేతలకు ఓటర్లు గుణపాఠం చెప్పాలన్నారు.  బీహార్ తొలి దశ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ప్రధాని మోడీ గేరు మార్చారు. ఒకే రోజు నాలుగు సభల్లో పాల్గొన్నారు. తన మాటలతో జనం మనసును గెలుచుకునే ప్రయత్నం చేశారు. బహిరంగ సభలకు జనసమీకరణ అంతా ప్రణాళిక ప్రకారం సాగడంతో ప్రచారసభలు గ్రాండ్ గా సాగాయి. మొత్తానికి ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొలది సుడిగాలి పర్యటనలు, బహిరంగ సభలతో మోదీ టాప్ గేర్ వేశారు.

ముంగేర్...బెగుసరాయ్...సమస్తీపూర్...సభ ఏదైనా...ప్రజలు మాత్రం భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎన్నికల సభలకు హాజరైన జన సందోహాన్ని చూసిన ప్రధాని మోడీ ఎన్డీయే పక్షాల విజయం తథ్యమన్నారు. బీహార్ లో ఎక్కడికివెళ్లినా...హాజరైన భారీ జన సందోహం చూస్తే, రాష్ట్ర సర్కార్ పై ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో స్పష్టమవుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ అహంకారపూరితంగా వ్యవహరించిన నేతలకు ఎలా బుద్ధిచెప్పారో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ గుణపాఠం నేర్పాలని సూచించారు. మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న ముంగేర్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటైన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీ లాలూప్రసాద్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. హిందువులు కూడా పశుమాంసం తింటున్నారంటూ వ్యాఖ్యానించిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారన్నారు. లాలూ వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పడంతో ఆ సమయంలో సైతాన్ పూనిందని సమాధానమిచ్చారని, కోట్లాదిమంది ప్రజలుండగా సైతాన్, లాలూనే ఎందుకు ఎంచుకుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles